Begin typing your search above and press return to search.

ద‌య‌తో చంపాలంటున్న రాజీవ్ కిల్ల‌ర్‌

By:  Tupaki Desk   |   22 Jun 2017 7:09 AM GMT
ద‌య‌తో చంపాలంటున్న రాజీవ్ కిల్ల‌ర్‌
X
మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య‌లో దోషి అయిన రాబ‌ర్ట్ పియోస్ త‌న‌ను ద‌య‌తో చంపేయాల‌ని కోరుతున్నాడు. ప్ర‌స్తుతం యావ‌జ్జీవ కారాగార శిక్షను అనుభ‌విస్తున్న ఆయ‌న‌.. మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మ‌ర‌ణానికి) కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతున్నాడు. ఇందుకు సంబంధించిన ద‌ర‌ఖాస్తును చేసుకున్నాడు.

రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో నేరారోప‌ణ‌లు నిరూపిత‌మైన దోషుల్లో రాబ‌ర్ట్ పియోస్ ఒక‌రు. అత‌డు చేసిన త‌ప్పున‌కు యావ‌జ్జీవ కారాగార‌శిక్ష‌ను అనుభ‌విస్తున్నాడు. అయితే.. అత‌గాడు జైల్లో స‌త్ప్ర‌వ‌ర్త‌న నేప‌థ్యంలో ఇటీవ‌ల త‌మిళ‌నాడు రాష్ట్ర స‌ర్కారు రాబ‌ర్ట్ తో స‌హా మొత్తం ఏడుగురు నిందితుల్ని విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం అడ్డుకోవ‌టంతో వారి విడుద‌ల ఆగిపోయింది.

ఇదిలా ఉండ‌గా.. త‌న‌ మెర్సీ కిల్లింగ్‌ కు అనుమ‌తి ఇవ్వాలంటూ ఆయ‌న కోరుతూ పిటీష‌న్‌ పెట్టుకోవ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాబ‌ర్ట్ శ్రీలంక‌కు చెందిన త‌మిళుడు. 1980ల‌లో భార‌త్‌కు చెందిన శాంతిసైన్యం శ్రీలంక‌లో చేసిన వేధింపుల్లో త‌న కొడుకు చ‌నిపోయాడ‌న్న ఆగ్ర‌హంతో రాజీవ్‌ను హ‌త్య చేసేందుకు జ‌రిపిన కుట్ర‌లో పాలు పంచుకున్నాడు. 1991 మేలో రాజీవ్ హ‌త్య జ‌రిగిన అనంత‌రం ఇత‌గాడి పాత్ర‌ను గుర్తించి విచార‌ణ అధికారులు ఇత‌డ్ని అదుపులోకి తీసుకున్నారు.

నేరం చేసిన‌ట్లు ఆధారాలు ల‌భ్యంకావ‌టంతో కోర్టు రాబ‌ర్ట్ కు యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను వేసింది. జైల్లో 26 ఏళ్ల నుంచి శిక్ష అనుభ‌విస్తున్న అత‌డు.. బ‌య‌ట‌కు విడుద‌ల‌య్యే అవ‌కాశం లేక‌పోవ‌టంతో త‌న కారుణ్య మ‌ర‌ణానికి అనుమ‌తి ఇవ్వాలంటూ అధికారుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే.. ఈ విష‌యం మీద తాము ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేమ‌ని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర డీజీపీ ద్వారా హోంశాఖ‌కు పంప‌నున్న‌ట్లు జైలు అధికారులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/