Begin typing your search above and press return to search.
రాజీవ్ గాంధీ హత్య కేసులో హైకోర్టుకు ఆ ఆరుగురు!
By: Tupaki Desk | 30 May 2022 10:00 AM GMTదివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో ఆరుగురు కూడా తమను విడుదల చేయాలని కోరుతూ వచ్చే వారం తమిళనాడు హైకోర్టును ఆశ్రయించనున్నారు. కొద్ది రోజుల క్రితం రాజీవ్ గాంధీ హత్య కేసులో మరో నిందితుడు పెరారివలన్ ను సుప్రీంకోర్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత 30 ఏళ్లకు పైగా తమిళనాడు జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్, శాంతన్, రాబర్ట్ ఫయాజ్, జయకుమార్, రవిచంద్రన్ తమను కూడా విడుదల చేయాలని తమిళనాడు హైకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా ప్రస్తుతం రాజీవ్ హత్య కేసు ముద్దాయిలైన నళిని, ఆమె భర్త మురుగన్, శాంతన్ తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. రాబర్ట్ ఫయాజ్, జయకుమార్ పుళల్ సెంట్రల్ జైలులో, రవిచంద్రన్ మదురై సెంట్రల్ జైలులో ఉన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో మే 18న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత 31 ఏళ్లుగా తమిళనాడుల్లోని జైల్లో మగ్గుతున్న పెరారివలన్‌కు విముక్తిని ప్రసాదించింది. ఈ మేరకు అతడిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1991లో మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజీవ్ గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీ ఈ) తీవ్రవాదులు మానవ బాంబుతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రాజీవ్ గాంధీతోపాటు మరో 14 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాజీవ్‌గాంధీ హత్యకు సహకరించిన మొత్తం ఏడుగురికి కోర్టు ఉరి శిక్ష విధించింది. తర్వాత దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. కోర్టు విధించిన జీవిత ఖైదు తమకు ఎప్పుడో ముగిసిందని కాబట్టి తమను జైలు నుంచి విడుదల చేయాలని ఏడుగురు నిందితులు ఒక్కొక్కరు వరుసగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పెరారివలన్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇప్పుడు మిగతా ఆరుగురు నిందితులు వచ్చే వారం తమను విడుదల చేయాలని హైకోర్టును కోరనున్నారు.
కాగా రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయిలైన తక్కిన ఆరుగురిని విడుదల చేసే విషయమై న్యాయనిపుణులతో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ కూడా తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో ఐదోసారి పెరోల్ పొంది కాట్పాడి బ్రహ్మపురంలో ఉంటున్న నళినిని ఆమె తరఫు న్యాయవాది పుగళేంది తాజాగా కలుసుకున్నారు. ఆ తర్వాత పుగళేంది విలేఖరులతో మాట్లాడుతూ... రాజీవ్ హత్యకేసు ముద్దాయిలు ఏడుగురిని విడుదల చేయాలని శాసనసభ తీర్మానం చేసిందని, ఆ బిల్లును గవర్నర్ ఇటీవల రాష్ట్రపతికి పంపారని తెలిపారు.
నళిని సహా ఆరుగురు ముద్దాయిలు విడుదల చేసే విషయమై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, అయితే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. జూన్ నెలాఖరులోగా ఆరుగురు ముద్దాయిలను ప్రభుత్వం విడుదల చేస్తుందని భావిస్తున్నామని పుగళేంది చెప్పారు
ఇదిలా ఉండగా వేలూరు జైలులో ఉన్న మురుగన్‌కు అత్యవసరంగా ఆరు రోజుల పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య నళిని జైళ్ల శాఖ అధికారులకు లేఖ రాశారని, దానిని పరిశీలించి మురుగన్‌కు ప్రభుత్వం పెరోలు మంజూరు చేసే అవకాశం ఉందని న్యాయవాది పుగళేంది తెలిపారు. అదే సమయంలో మురుగన్‌కు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ జూన్ ఒకటిన హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ఆయన చెప్పారు.