Begin typing your search above and press return to search.
కారుణ్య మరణానికి అనుమతి కోరిన రాజీవ్ హంతకులు..!
By: Tupaki Desk | 2 Dec 2019 11:22 AM GMTదివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ని 1991 మే 21 న హత్య చేసారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో హంతకులు మురుగన్ - సంతన్ - పెరారివాలన్ - జయకుమార్ - రవిచంద్రన్ - రాబర్ట్ పేయాస్ - నళిని జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. వీరు గత 27 సంవత్సరాలుగా జైలు జీవితాన్ని గడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ కాలం పాటు జైలు జీవితం గడిపిన వారిలో నళిని ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నళినీ శ్రీహరన్ - ఆమె భర్త మురుగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
తమ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేము విడుదలవుతామని గత 26 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాం. ఇప్పుడు ఆ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జైలు అధికారులు నా భర్త మురుగన్ ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. వారు నా భర్తను పెడుతున్న బాధలు చూడలేకపోతున్నాను. దీనితో మా కారుణ్య మరణానికి అనుమతించండి అని నళిని ప్రధానికి ఒక లేఖ రాసిన లేఖలో తెలిపింది. ఈ మేరకు గత నెల 27న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ కి నళిని లేఖ రాశారు.
అలాగే తమను వెల్లూరు జైలు నుంచి పుఝల్ జైలుకు తరలించాలంటూ నళిని తమిళనాడు ప్రభుత్వానికి వినతిపత్రం పంపారు. వెల్లూరు జైలు అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆమె - వెల్లూరు జైల్లో మురుగన్ వద్ద సెల్ ఫోన్ లభించడంతో అధికారులు ఆయనను ఒంటరిగా ఉంచుతున్నారు. దీనికి నిరసనగా గత పది రోజుల నుంచి నళిని - మురుగన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నళినిని ప్రస్తుతం వెల్లూరులోని ప్రత్యేక మహిళా జైల్లో ఉంచారు. ఇకపోతే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా సిఫార్సు చేస్తూ తమిళనాడు రాష్టమ్రంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ తీర్మానం రాజ్ భవన్ కు చేరింది. గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ మంత్రివర్గం చేసిన తీర్మానంపై తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.