Begin typing your search above and press return to search.

కర్ప్యూ వేళలో రోడ్డుపై చిందులేసి.. అడ్డంగా బుక్

By:  Tupaki Desk   |   17 April 2021 4:33 AM GMT
కర్ప్యూ వేళలో రోడ్డుపై చిందులేసి.. అడ్డంగా బుక్
X
సోషల్ మీడియా పిచ్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఫాలోయర్ల సంఖ్య పెంచుకోవటానికి.. తాము పెట్టే పోస్టుకు భారీగా లైకులు.. కామెంట్లు రావాలన్న ఆశతో చేసే పనులు అన్ని ఇన్ని కావు. ఈ క్రమంలో కొందరు హద్దులు దాటేసి.. చిక్కుల్లో పడతారు. తాజాగా ఒకయువతికి అలాంటి అనుభవమే ఎదురైంది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల కోసం ఆమె చేసిన పనికి ఇప్పుడు కిందామీదా పడుతోంది. ఈఒక్కసారికి తనను వదిలేయాలని ప్రాధేయపడే పరిస్థితి. ఇంతకీ ఏం జరిగిందంటే..

గుజరాత్ లో ఇప్పుడు కరోనా కేసులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో.. ఆ రాష్ట్రంలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. అందరికి కర్ఫ్యూ ఏమో కానీ.. తన లాంటి సోషల్ మీడియా సెలబ్రిటీకి కర్ఫ్యూ ఒక లెక్కనా అనుకున్నారు రాజ్ కోట్ కు చెందిన ప్రిషా రాథోడ్. ఈ అమ్మడు ఈవెంట్లను మేనేజ్ చేస్తుంటుంది. ఆకర్షణీయమైన రూపం.. అందుకు తగ్గట్లు ఉత్సాహంగా ఉండే ఆమె పోస్ట్ చేసే పోస్టులతో ఆమెకుఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉన్నారు.

దీంతో.. ఇన్ స్టాలో ఉన్న తన ఫాలోవర్ల కోసం ఆమె ఒక సాహసానికి తెర తీశారు. కర్ఫ్యూవేళ.. రోడ్డు మీదకు వచ్చి ఒక పాటకు డ్యాన్స్ వేసేసింది. దీనికి సంబంధించిన వీడియోను సిద్ధం చేసి.. సర్ ప్రైజ్ అంటూ పోస్టు చేసింది. దీన్ని చూసిన పలువురు.. నిబంధనల్ని ఇలా బ్రేక్ చేయటమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్లు చేశారు. దీంతో..రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె మీద కేసు నమోదు చేశారు. ఈ విషసయం కాస్తా ప్రిషాకు తెలీటంతో వెంటనే.. ఆమె తన ఖాతాలోని వీడియోను డిలీట్ చేశారు.

అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె అకౌంట్లో వీడియో లేకున్నా.. అప్పటికే వేలాది మంది దాన్ని షేర్ చేసుకోవటంతో వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. పోలీసులు కేసు బుక్ చేయటంతో.. తాను కావాలని తప్పు చేయలేదని చెప్పుకుంటోంది. కరోనా కారణంగా కర్ఫ్యూ విధించిన వేళ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. మొదటిసారి తప్పు చేసిన ప్రిషాకు వార్నింగ్ ఇచ్చారు కానీ.. కేసు మాత్రం కొట్టేయలేదు. దీంతో.. అమ్మడు తెగ టెన్షన్ పడిపోతున్నారట. చట్టాన్ని ఉల్లంఘించే చర్యలు తీసుకోవటం ఎందుకు? ఇప్పుడు ఇలా కిందా మీదా పడటం ఎందుకు?