Begin typing your search above and press return to search.
వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన నటుడికి స్మృతి పంచ్!
By: Tupaki Desk | 22 Nov 2017 4:56 AM GMTకదిలించి మరీ తిట్టించుకోవటంలో కొందరు ఎక్స్ పర్ట్స్. బాలీవుడ్ నటుడి ఉదంతం చూస్తే.. ఈ మాట ఎంత నిజమన్నది అర్థమవుతుంది. కేంద్రమంత్రిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసే ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయ్యారు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్. చూస్తూ చూస్తూ స్మృతి ఇరానీ లాంటి మాటకారి మహిళా నేతను కదిలిస్తారా? తన మాటలతో సీనియర్ నేతలకు సైతం చుక్కలు చూపించే స్మృతిపై సెటైర్ వేసే ప్రయత్నంలో సదరు నటుడికి భారీ షాక్ తగిలిందని చెప్పాలి.
ప్రస్తుతం గోవాలో 48వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం జరిగింది. దీనికి నటుడు రాజ్ కుమార్ రావ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వేడుకకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఇరానీ దర్శకుడు మజిద్ మజీది తీసిన బియాండ్ ద క్లౌడ్స్ చిత్రాన్ని ప్రదర్శించారు.
ఇంత వరకూ బాగానే సాగిన కార్యక్రమాన్ని తన మాటలతో మలుపు తిప్పి అడ్డంగా బుక్ అయ్యారు రాజ్ కుమార్.
ఇరానియన్ సినీ దర్శకుడు తీసిన చిత్రం గురించి మాట్లాడుతూ.. అరె.. మజిద్ మన కేంద్రమంత్రి స్మృతి ఇరానీలానే ఆయన కూడా ఇరానీనే (స్మృతి పేరు చివరన ఉన్న ఇరానీ మాటను ఒత్తి పలుకుతూ) అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనికి మంత్రి స్మృతి మాట్లాడే సందర్భంలో బాలీవుడ్ నటుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక కేంద్రమంత్రిపై బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ కామెంట్ చేశాడు. దీంతోనే తమ ప్రభుత్వం ఎంత సహనంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని స్మృతి.. కనీసం నీ కామెంట్ తో అయినా నీ కాలు విరగొట్టింది బీజేపీ కార్యకర్తలేనని ఎవరూ మాపై నిందలు వేయకుండా ఉంటారంటూ చురకలు అంటించారు. కదిలించి మరీ కడుపు నిండా పెట్టించుకోవటం అంటే ఇదేమరి.