Begin typing your search above and press return to search.

షాకు ధీటైన పంచ్ వేసిన గాంధీ మ‌న‌మ‌డు

By:  Tupaki Desk   |   11 Jun 2017 9:05 AM GMT
షాకు ధీటైన పంచ్ వేసిన గాంధీ మ‌న‌మ‌డు
X
ఎంత అధికారం చేతిలో ఉంటే మాత్రం.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే అడ్డంగా బుక్ కావాల్సిందే. ఆ విష‌యంలో ఎవ‌రికి ఎలాంటి మిన‌హాయింపులు ఉండ‌వు. తాజాగా నోరు జారిన‌ట్లుగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి మాట‌ల‌పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. జాతిపిత మ‌హాత్మాగాంధీని కులం గాడిన క‌ట్టేస్తూ.. ఆయ‌న‌పై షా చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల్ని పలువురు ఖండిస్తున్నారు.

రాయ‌పూర్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గాంధీజీ సామాజిక వ‌ర్గాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఆయ‌న్ను తెలివైన/చ‌మ‌త్కారి అయిన వ్యాపారిగా షా అభివ‌ర్ణించ‌టం తెలిసిందే. అమిత్ మాట‌ల‌పై ప‌లువురు విమ‌ర్శ‌లు చేయ‌గా.. తాజాగా జాతిపిత మ‌హాత్మ గాంధీజీ మ‌న‌మ‌డు రాజ్ మోహ‌న్ గాంధీ ధీటైన స‌మాధానం ఇచ్చారు. భార‌త్ లో తిష్ట వేసిన బ్రిటీష్ సింహాల‌పై సంప్ర‌దాయ‌వాదం పేరిట విషం చిమ్మే వారిపై విజ‌యం సాధించిన వ్య‌క్తి తెలివైన వ్యాపారి కంటే అనేక రెట్లు అధికం అంటూ త‌న తాత గొప్ప‌త‌నాన్ని గాంధీజీ మ‌న‌మ‌డు పేర్కొన్నారు.

మ‌హాత్ముని ల‌క్ష్యం బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ లాంటి వారికంటే చాలా భిన్నం. సింహాల్లాంటి శ‌త్రువుల‌ను త‌రిమికొట్టి.. బ‌ల‌హీనుల్లో ఆత్మ‌స్థైర్యం నింపి వారిని అంద‌లం ఎక్కించారు. అమిత్ షా వ్యాఖ్య‌లు వింటే న‌వ్వు వ‌స్తుంద‌న్నారు. సంప్ర‌దాయ‌వాదులంటూ త‌మ‌నుతాము గొప్ప‌గా చెప్పుకునే అమిత్ షాకు మంట పుట్టేలా జాతిపిత మ‌న‌మ‌డు పంచ్ వేశార‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/