Begin typing your search above and press return to search.
చంద్రుళ్లకు తీపికబురు..ఇంకొంచెం లేట్
By: Tupaki Desk | 7 April 2017 6:54 AM GMTఅసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందా.. లేదా.. అన్నది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. వీటిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నోట్ తయారుచేసిందని, కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం లభించడమే తరువాయి అని, ఈ సమావేశాల్లోనే వస్తే రావచ్చని.. ఇలా రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొంతమేరకు స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటూ రెండు రాష్ర్టాల నుంచి తమకు విజ్ఞప్తులు అందాయని, వాటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తద్వారా రెండు తెలుగు రాష్ర్టాల చంద్రుళ్లకు తీపి కబురు విషయంలో కొంత జాప్యం తప్పదని పేర్కొన్నారు.
పార్లమెంటు ఆవరణలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేకంగా తెలుగు మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఉన్నప్పటికీ దీన్ని అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. వాటిపై తాము అధ్యయనం చేస్తున్నామని, రాజ్యాంగ నిపుణుల నుంచి అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోడానికి చర్చలు జరుగుతున్నాయని వివరించారు. క్యాబినెట్ నోట్ తయారీ గురించి ప్రస్తావించగా, ఇంకా చర్చిస్తూ ఉన్నందున స్పష్టమైన నిర్ణయానికి రావాల్సి ఉందని, ఆ స్పష్టత వస్తే నోట్ తయారవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి చెప్పారు. నోట్ తయారైన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయానికి అధ్యయనం కోసం వెళ్ళడం-ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం లభించడం- ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వశాఖ దీనికి సంబంధించిన బిల్లును తయారుచేయడం-అనంతరం దానిని పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందడం.. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత సీట్ల సంఖ్య పెరుగుతుంది.
కాగా, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేందుకు రాజ్యాంగాన్నే సవరించాలా లేక పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరిస్తే సరిపోతుందా అనేదానిపై మాత్రం రాజ్ నాథ్ సింగ్ ఎక్కువ వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ అంశాన్ని హోం మంత్రిత్వశాఖ అధికారులు వివిధ దశల్లో చర్చిస్తున్నందున, ఏది అవసరమో నిర్ణయమైతే దానిని బట్టి తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెండు రాష్ర్టాల నుంచి విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో సీట్ల సంఖ్యను పెంచడానికి సూత్రరీత్యా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందువల్లనే దీన్ని ఏ విధంగా చేయవచ్చనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా రెండువారాల క్రితం స్వయంగా ఈ అంశంపై కేంద్ర హోం మంత్రితో మాట్లాడారు. కేంద్ర క్యాబినెట్ లో దీన్ని చర్చించేందుకు వీలుగా నోట్ తయారవుతున్నదని, అన్నీ అనుకూలిస్తే ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని ఆయన చెప్పడం సానుకూల సంకేతంగా కనిపిస్తున్నది.
సీట్ల సంఖ్య పెంచడానికి పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టమైన హామీ ఉన్నప్పటికీ రాజ్యాంగంలోని 170(3)తో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనేక కోణాల నుంచి ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏ విధంగా అధిగమించవచ్చనేదానిపై దృష్టి కేంద్రీకరించింది. రాజ్యాంగాన్ని సవరించడమే మేలనే అభిప్రాయానికి వచ్చినప్పటికీ అది కేవలం ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఏ రాష్ట్రం నుంచి ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినా శాశ్వత పరిష్కారంగాఉపయోగపడాలనిహోంశాఖ భావిస్తున్నట్లు సమాచారం. న్యాయమంత్రిత్వశాఖతోపాటు హోంశాఖలోని శాసన వ్యవహారాల విభాగం నుంచి కూడా అభిప్రాయాలను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా దీనిపై స్పష్టమైన నిర్ణయానికి రావాలనుకుంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/