Begin typing your search above and press return to search.

సీఎంగా రాజ్‌ నాథ్ సింగ్‌

By:  Tupaki Desk   |   22 May 2016 7:32 AM GMT
సీఎంగా రాజ్‌ నాథ్ సింగ్‌
X
ఉత్తరప్రదేశ్‌ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల‌కు బీజేపీ అధిష్టానం సిద్ధ‌మవుతోంది. ఇటీవలి అస్సాం ఎన్నికల్లో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్‌ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించి విజయం సాధించిన నేపథ్యంలో ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు ముందే స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ ను బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలున్నాయి. రాజ్‌ నాథ్ పేరుతో ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని స‌మాచారం.

కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లేదా ప్రియాంకగాంధీల్లో ఒకరిని యూపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉండటంతో అనుభవం కల నేతగా రాజ్‌ నాథ్‌ ను ప్రొజెక్ట్ చేయాలని బీజేపీభావిస్తోంది. బీజేపీలో యువనాయకులు ఉన్నా బీఎస్పీ అధినేత్రి మాయావతి - సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయంల అనుభవంతో పోలిస్తే రాజ్‌ నాథ్ ఒక్కరే సరైన నాయకుడని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. బీజేపీ యువనేతల్లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ - పార్టీ సీనియ‌ర్ నేత‌లు యోగీ ఆదిత్యానాథ్ - మహేశ్ శర్మ - కేశవ్ మౌర్య పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరెవ‌రూ మాయావతి - ములాయంల ముందు వీరు నిలవలేరని కమలనాథులు భావిస్తున్నారు. దీనికితోడు 2019 ఎన్నికల దృష్ట్యా యూపీని గెలవడం బీజేపీ ముందున్న అతి పెద్ద సవాలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డ‌మే. ఈ నేప‌థ్యంలో స‌మీక‌ర‌ణాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని రాజ్‌ నాథ్ వైపు కమలనాధులు మొగ్గుతున్నారని స‌మాచారం.