Begin typing your search above and press return to search.

పాక్‌ ను సొంత‌గ‌డ్డ‌పై అవ‌మానించిన హోం మంత్రి

By:  Tupaki Desk   |   4 Aug 2016 4:56 PM GMT
పాక్‌ ను సొంత‌గ‌డ్డ‌పై అవ‌మానించిన హోం మంత్రి
X
పాకిస్థాన్ గ‌డ్డ‌పై నిల్చొనే ఆ దేశానికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌. ఉగ్ర‌వాదులు - ఉగ్ర‌సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే కాదు వారికి మ‌ద్ద‌తు తెలిపే వ్య‌క్తులు - సంస్థ‌లు - దేశాల‌పై కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. సార్క్ స‌మావేశాల్లో భాగంగా రాజ్‌ నాథ్ సింగ్ పాకిస్తాన్ ప‌ర్య‌ట‌నలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది.

సార్క్ స‌ద‌స్సులో భాగంగా రాజ్‌ నాథ్‌ - పాక్ హోంమంత్రి నిసార్ అలీఖాన్ క‌నీసం క‌ర‌చాలనం కూడా చేసుకోలేదంటే రెండు దేశాల మ‌ధ్య ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. స‌మావేశం కోసం వ‌చ్చిన అతిథుల‌ను త‌లుపు ద‌గ్గ‌రే నిల‌బ‌డి నిసార్ అలీఖాన్ ఆహ్వానిస్తున్న స‌మ‌యంలో.. రాజ్‌ నాథ్ ఎదురుప‌డ్డారు. కానీ ఇద్ద‌రూ క‌ర‌చాల‌నం కూడా చేసుకోలేదు. రాజ్‌ నాథ్ నేరుగా స‌మావేశ మందిరంలోకి వెళ్లిపోయారు. మ‌రోవైపు హోంమంత్రికి విందు ఇవ్వ‌డం ద్వారా బుజ్జ‌గింపు రాజ‌కీయం చేయాల‌ని పాక్ ప్ర‌య‌త్నించింది. సార్క్ సదస్సులో ప్రధాన కార్యక్రమం ముగియగానే క్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ద్వారా రాజ్‌ నాథ్‌ కు విందు ఇవ్వాలనేది ప్లాన్. అయితే సరిగ్గా సదస్సు ముగియగానే విందు సమావేశం నుంచి పాక్ హోం మంత్రి మాయమయ్యారు. దీంతో ఒక్క‌సారిగా పాక్ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాయి.

ఇదిలాఉండ‌గా సార్క్ స‌ద‌స్సులో భాగంగా ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్టాలంటూ సాగిన రాజ్‌ నాథ్ ప్ర‌సంగాన్ని పాక్ మీడియా బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఉగ్ర‌వాదుల‌ను అమ‌ర‌వీరులుగా కీర్తించ‌డం మానుకోవాల‌ని ప‌రోక్షంగా పాకిస్థాన్‌ కు - ఉగ్ర‌వాది హ‌ఫీజ్ స‌యీద్‌ కు హెచ్చ‌రిక‌లు జారీచేశారు. సార్క్ స‌ద‌స్సు కోసం రాజ్‌ నాథ్ ఇస్లామాబాద్ వెళ్ల‌డం రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌ల‌ను మ‌రింత పెంచింది. ఆయ‌న అక్క‌డ అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచీ క‌శ్మీర్‌ - ఉగ్ర‌వాది బుర్హాన్ వానిల‌పై రెచ్చగొట్టే వ్యాఖ్య‌లు చేశారు.