Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాటకు రాజ్ నాథ్ ఎగిరి కింద పడ్డంత పనైందట!
By: Tupaki Desk | 3 April 2019 5:02 AM GMTమాటలు మంత్రాలన్నది ఎంత నిజమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంటుంది. ఆయన చెప్పే గొప్పలు ఎంత బాగుంటాయి. ఇలానే ఇంకెవరైనా చెబితే ఎటకారం చేసేస్తుంటారు.కానీ.. కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు ఎటకారం చేయాలన్న ఆలోచన కూడా రాదు. హైటెక్ సిటీ తన కష్టమని చంద్రబాబు చెబితే.. హైదరాబాద్ ఆయన కట్టాడంట.. అంటూ ఎటకారపు ఎద్దేవా చేసే కేసీఆర్ మాటలు విన్నంతనే నిజమనిపిస్తాయి. వాస్తవంగా చూస్తే.. హైటెక్ సిటీ ఏర్పాటు చేయాలన్న విజన్ ను తప్పు పట్టలేం.
ఈ రోజున హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి మొత్తం హైటెక్ సిటీ వైపునే ఉందన్నది మర్చిపోలేం. ఈ రోజున హైదరాబాద్ మహా నగరంలో వచ్చే ఆదాయంలో సింహభాగం ఐటీ నగరి నుంచేనన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అలా అని.. క్రెడిట్ మొత్తాన్ని చంద్రబాబుకే ఇవ్వాలని అనటం లేదు. చంద్రబాబు విత్తనం వేసి.. మొక్కను చేసి.. దాన్ని చెట్టుగా రూపాంతరం చెందేలా జాగ్రత్త చేస్తే.. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ ఇమేజ్ ను అంతకంతకూపెంచే ప్రయత్నం చేశారే కానీ తుంచే ప్రయత్నం చేయలేదు. ఇదే.. చెట్టు కాస్తా మహావృక్షంగా మారే అవకాశాన్ని ఇచ్చింది.
వైఎస్ తర్వాత సీఎం అయిన రోశయ్య కానీ.. కిరణ్ కుమార్ రెడ్డిలు హైదరాబాద్ ఇమేజ్ ఎక్కడా దెబ్బ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే పరంపరను కేసీఆర్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ..ఈ నిజాన్ని కేసీఆర్ ఎలా చెబుతారన్నది అందరికి తెలిసిందే. ఇలా తన మాటలతో ట్విస్ట్ చేయటం.. తాను మెచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేయటం.. నచ్చని వారిని పాతాళానికి తొక్కేస్తూ.. ఎటకారం చేసుకోవటం ఆయనకు బాగానే అలవాటు. పెద్ద నోట్ల రద్దు వేళ.. దేశ నాయకులంతా మౌనంగా ఉంటే.. కేసీఆర్ మాత్రం ప్రధాని మోడీని ప్రత్యేకంగా టైం అడిగి మరీ.. ప్రశంసించటమే కాదు.. మరికొన్ని సలహాలు తానిచ్చినట్లుగా చెప్పారు.
అంతేకాదు.. మోడీ తన సూచనల్ని జాగ్రత్తగా వింటారన్న మాటను చెప్పటం.. ఆ క్రమంలో ప్రధాని విజన్ మంచిగా ఉంటుందన్న కితాబులు ఇవ్వటం చూసి బీజేపీ నేతలు చంకలు కొట్టుకున్నారు. కేసీఆర్ సైతం మోడీని పొగుడుతున్నారనుకున్నారే కానీ.. మోడీకి సైతం సలహాలు ఇచ్చే తెలివైనోడు కేసీఆర్ అన్న విషయాన్ని ప్రజల మనసుల్లో వ్యూహాత్మకంగా రిజిస్టర్ చేస్తున్న విషయాన్ని మర్చిపోయారు.
ఈ రోజున ప్రధాని మోడీని ఉద్దేశించి కేసీఆర్ పరుషంగా మాట్లాడుతున్నారంటే కారణం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్.. బీజేపీ దొందు దొందే అనేస్తున్న కేసీఆర్.. గతంలో మోడీ విజన్ ను ఎందుకంతగా పొగిడినట్లు? అన్న ప్రశ్న వేసుకుంటే అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. సమయానికి తగ్గట్లు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటానికి కేసీఆర్ వెనుకాడరు.
తన గొప్పతనాన్ని చెప్పే క్రమంలో అవతల వారిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు.. కల్యాణలక్ష్మి పథకాల్ని ఎలా అమలు చేస్తున్నారంటూ కేంద్రమంత్రి రాజ్ నాథ్ అడిగితే.. తాను చెప్పిన మాటలకు ఆయన ఎగిరి కింద పడ్డంత పని చేశారని చెబుతూ.. "కేసీఆర్ మీ రాష్ట్రంలో రైతు బంధు - కల్యాణలక్ష్మి లాంటి పథకాలు ఎలా అమలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అడిగిండు. ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ.5,000 చొప్పున ఇస్తున్నామని రైతుబంధు పథకం గురించి చెప్పిన. మీరు ఇచ్చిన పైసలు వారు ఎన్ని విడతల్లో తిరిగి ఇవ్వాలని అడిగిండు. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు - మా రాష్ట్రంలో రైతులు చితికిపోయి సమస్యల్లో ఉన్నారు - ఉచితంగానే ఇస్తున్నామని ఆయనకు చెప్పిన. ఇది విని ఆయన కుర్చీలోంచి కిందపడ్డంత పని చేసిండు. తెలంగాణలాగా దేశ రైతులకు రైతుబంధు - కల్యాణలక్ష్మి - రైతుబీమా లాంటి పథకాలను అమలు చేసే సోయి కేంద్ర ప్రభుత్వాలకు లేదా?’’ అని ప్రశ్నించటం చూస్తే.. తన గొప్పతనాన్ని.. కేంద్రం చేతకానితనాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు.
కేసీఆర్ మాటల్ని చూస్తే.. తమ ప్రభుత్వ గొప్పతనాన్ని ఆయన ఎంత చక్కగా చెప్పుకున్నారో అర్థమవుతుంది. అదే సమయంలో తమ ప్రభుత్వం చేస్తున్న పనికి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఎంతలా రియాక్ట్ అయ్యారో చెప్పటం ద్వారా.. తామెంత ఘనకార్యం చేస్తున్నామన్న విషయాన్ని చెబుతూనే.. తమ పని తీరు అవతల వారికి ఎంత షాకింగ్ గా ఉందన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి.