Begin typing your search above and press return to search.
కాంగ్రెస్‌తో కలిసే పార్టీలు మీటూ అనాల్సిందే!
By: Tupaki Desk | 28 Oct 2018 5:03 AM GMTసార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయం హీటెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడుగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన ప్రతిష్టాత్మక సమావేశానికి హైదరాబాద్ ను వేదిక చేసుకుంది. హైదరాబాద్ లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన బీజేవైఎం విజయలక్ష్య-2019 యువ మహాదివేశన్ సదస్సును కమళనాథులు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తనదైన శైలిలో ప్రసంగించారు. భగత్ సింగ్ కలలుగన్న సుపరిపాలనను మోదీ సర్కార్ అందిస్తున్నదని చెప్పారు. జాతిహితం కన్నా రాజకీయహితమే కాంగ్రెస్ కోరుకొంటున్నదని, స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ ను రద్దుచేయాలన్న గాంధీ మాటలు చెవిన పెట్టలేదని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓడించడం మినహా విపక్షాలకు మరోఎజెండా లేదని కేంద్ర హోంమంత్రి ఎద్దేవా చేశారు. అన్నిపక్షాలు ఒక్కటైనా కూడా మోదీని - బీజేపీని ఆపలేవన్నారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని - ఇప్పుడు కాంగ్రెస్‌తో వెళ్లే పార్టీలు ఎన్నికల తర్వాత మీటూ ఉద్యమం చేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. రాఫెల్ ఒప్పందం విషయంలో చేస్తున్న విమర్శల ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఫెయిల్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఆరునెలలపాటు ఇళ్లను వీడి 350 సీట్లు గెలిచేంతవరకు కార్యకర్తలు నిద్రపోవద్దని సూచించారు. మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. పెట్రోల్ ధరల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని - పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలపై అంతర్జాతీయ ఒత్తిళ్లే కారణమన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. బయోఎనర్జీ - సోలార్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని చెప్పడం ద్వారా పెట్రో ఉత్పత్తి దేశాలపై ఒత్తిడి తెస్తున్నట్టు వెల్లడించారు. వేల గ్రామాలకు విద్యుత్ కూడా ఇవ్వనివారు మోడీని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్న పార్టీలే అధికారంలో ఉన్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. రూ.70 వేల కోట్లతో కేంద్రం పోలవరం ప్రాజెక్టును కడుతున్నప్పటికి కూడా కొందరు తమ మీద ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా తెలుగుదేశం ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. కృష్ణా- పెన్నా నదులను అనుసంధానం చేసి ఆంధ్ర - తెలంగాణ - కర్ణాటక - తమిళనాడులో చివరి గ్రామం వరకు నీళ్లు అందిస్తామని చెప్పారు.