Begin typing your search above and press return to search.

ఓడిపోయినా అదే ప‌నిచేస్తున్న బీజేపీ

By:  Tupaki Desk   |   9 Nov 2015 9:45 AM GMT
ఓడిపోయినా అదే ప‌నిచేస్తున్న బీజేపీ
X
బీహార్‌ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓటమికి చాలా కారణాలున్నా..ప్ర‌ముఖంగా వినిపిస్తున్న ఏకైక కార‌ణం హిందుత్వ విధానాలకు బీజేపీ వంత‌పాడ‌టం. బీఫ్ తో బీహార్ పోయింద‌ని బీజేపీ నాయ‌కులే బ‌హిరంగంగా వ్యాఖ్యానిస్తున్న ప‌రిస్థితి ఉన్న నేప‌థ్యంలో బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం నుంచి మ‌రో హాట్ అప్‌ డేట్ వ‌చ్చింది.

ఆర్‌ ఎస్‌ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బీహార్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రిజర్వేషన్లను స‌మీక్షించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రిజర్వేషన్లపై భగవత్ చేసిన వ్యాఖ్యలను ప్రధానాస్త్రంగా చేసుకొని బీహార్ ఎన్నికల ప్రచారంలో మహాకూటమి నేతలు ఎన్డీఏ కూటమిపై విమర్శనాస్ర్తాలను సంధించారు. ప్రస్తుతం బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లను రద్దుచేస్తారని ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్‌ యాదవ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. రాజ‌కీయ‌ప‌రిణామాలు ఇలాఉంటే...ఆర్‌ ఎస్‌ ఎస్ చీఫ్‌ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా జండేవాలాలోని సంఘ్ పరివార్ కార్యాలయం కేశవ్ కుంజ్‌ లో సమావేశమయ్యారు. అరగంట పాటు జరిగిన సమావేశంలో బీహార్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు.

మ‌రోవైపు మోహన్ భగవత్‌ తో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ సైతం భేటీ అయ్యారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వీరి భేటీ జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీహార్ ఎన్నికల కౌంటింగ్, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితి తదితర అంశాలు భేటీలో చర్చలకు వచ్చినట్లు సమాచారం.

అయితే అగ్ర‌నేత‌లు ఇలా భ‌గ‌వ‌త్‌ తో ములాఖ‌త్‌ లో బిజీగా ఉంటే... పార్టీ నాయ‌కులు మాత్రం భ‌గ‌వ‌త్ తీరుపై మండిప‌డుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ...బీహార్ ఎన్నికల సమయంలో కొందరు నేతలు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని ప‌రోక్షంగా భ‌గ‌వ‌త్‌ పై మండిపడ్డారు. అయితే ప్రతి ఎన్నిక...రెఫరెండం కాదని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లపై భగవత్‌ చేసిన వ్యాఖ్యలే ఓటమికి ప్రధాన కారణమని బీజేపీ హుకుందేవ్ విమ‌ర్శించారు. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపిన బీహార్ ఎన్నికల ఫలితాల్లో త‌మ విజ‌య‌వ‌కాశాల‌ను భ‌గ‌వ‌త్ దెబ్బ‌తీశార‌ని ఆక్షేపించారు. ఇదిలాఉండ‌గా ఇవాళ మధ్యాహ్నం జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం వాయిదా పడ‌టం ఆస‌క్తిక‌ర‌కంగా మారింది.