Begin typing your search above and press return to search.

పార్లమెంట్ ను కుదిపేసిన దిశ హత్య.. కేంద్రం ప్రకటన

By:  Tupaki Desk   |   2 Dec 2019 9:23 AM GMT
పార్లమెంట్ ను కుదిపేసిన దిశ హత్య.. కేంద్రం ప్రకటన
X
హైదరాబాద్ లో దారుణ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ ఘటన ఉదంతం పార్లమెంట్ లోనూ ప్రతిధ్వనించింది. ఈ అత్యాచారం, హత్య ఘటనను పార్లమెంట్ లోని ఎంపీలంతా లోక్ సభలో ముక్తకంఠంతో ఖండించారు.

ఈ మేరకు మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పార్లమెంట్ ఎంపీలతో ఈ ఘటనను ఖండించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అన్ని పార్టీలు అంగీకరిస్తే చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమని రాజ్ నాథ్ ప్రకటించారు.

ఇక తెలంగాణకే చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ పై ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని.. పోలీసులు ఇలాంటి ఘటనల్లో చురుకుగా పనిచేయాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఘటనలపై కేంద్రం సీరియస్ గా ఉందని.. కఠిన చట్టం చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.