Begin typing your search above and press return to search.
'ముష్కిల్' కు వందశాతం హామీ వచ్చేసింది!
By: Tupaki Desk | 21 Oct 2016 4:17 AM GMTపాకిస్థాన్ నటులు ఉన్న "ఏ దిల్ హై ముష్కిల్" సినిమాను విడుదల కానివ్వమంటూ ఇప్పటికే ఎవరికితోచిన స్థాయిలో వారు నిషేదం విధించారు. నిజంచెప్పాలంటే ఉడీ గురదాడుల అనంతరమే పాకిస్థాన్ నటులను నిషేదించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది... కానీ అప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమాల పరిస్థితి ఏమిటి? నిజం చెప్పాలంటే ఉడీ ఉగ్రదాడికి ముందు పాక్ నటులు బాలీవుడ్ లో భారతీయ నటుల మాదిరే చలామణి అయ్యరు కూడా! ఈ క్రమంలో ఉడీ ఉగ్రదాడి అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) సీరియస్ గా స్పందించింది, పాకిస్థాన్ నటీనటులు ఉన్న బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది, ఆ సినిమాలను విడుదల కానివ్వమని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిని రాజ్ నాథ్ సింగ్ ని కలిశారు దర్శకనిర్మాత మహేశ్ భట్ నేతృత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు.
ఈ భేటీ అనంతరం స్పందించిన మహేశ్ భట్... మోంమంత్రి తమకు వందశాతం భరోసా ఇచ్చారని, 'ఏ దిల్ హై ముష్కిల్" సినిమా విడుదలకు అడ్డంకులు లేకుండా చూడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కోరతానని తమతో చెప్పారని వెల్లడించారు. ఇదే సమయంలో సినిమా విడుదలవుతున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడి ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కాగా... కరణ్ జోహార్ తెరకెక్కించిన "ఏ దిల్ హై ముష్కిల్"లో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దెబ్బతో వెనకా ముందు చూడకుండా, వాస్తవాలు ఆలోచించకుండా ఎమోషన్స్ తో కూడిన నిర్ణయాలు తీసుకుంటే తదనంతర పరిణామాలు ఇలానే ఉంటాయని ఎమ్మెన్నెస్ కు ఈ దెబ్బతో తెలిసొచ్చిందని పలువురు బీజేపీ నేతలే ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారని కథానాలు రావడం గమనార్హం. దీంతో రాజ్ నాథ్ సింగ్ తీసుకున్న నిర్ణయంతో కరణ్ జోహార్ కు ఎంత ఆనందం కలిగి ఉంటుందో, ఎమ్మెన్నెస్ కు అంతలా షాక్ తగిలి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతునారు.
ఇదే క్రమంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పై కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో ఫైరయ్యారు. సినిమా ధియేటర్లపై దాడులు చేసే హక్కు ఎమ్మెన్నెస్ కు లేదని, అది రౌడీల పార్టీ అని అందుకే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. అసలు ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో, ఏ సినిమా చూడకూడదో నిర్ణయించే హక్కు ఎమ్మెన్నెస్ లేదని పేర్కొన్నారు. ఉడీలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాతే పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిందే కానీ, ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు ఇరుదేశాల సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు తెరకెక్కించినవన్న విషయం మరిచిపోకూడదని వివరించారు.