Begin typing your search above and press return to search.
మరో ఆశ; ఏపీ ప్రత్యేకంపై రాజ్‌నాథ్ కొత్తమాట
By: Tupaki Desk | 29 May 2015 11:46 AM GMTఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో లేదో కానీ.. ఆ పేరు మీద సాగుతున్న చర్చ.. హామీలు అన్నిఇన్ని కావు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తారని ఒకసారి.. ఇవ్వటం సాధ్యం కాదని మరోసారి.. ప్రత్యేకం తప్ప మరోలా సాయం చేస్తామని ఇంకోసారి ఇలా ఎవరికి వారు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
మూడు రోజుల క్రితం బీజేపీ అధినేత అమిత్‌షా సైతం.. ఏపీకి ప్రత్యేకహామీ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పటం తెలిసిందే.
తాజాగా.. కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై కాస్తంత స్పష్టత ఇచ్చారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీ.. తెలంగాణలో చాలా సమస్యలున్నాయని.. వాటికి పరిష్కారం కనుగునేందుకు కృషి చేస్తామని చెప్పిన ఆయన.. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్రహోం శాఖ మాట్లాడుతోందని చెప్పారు.
మొత్తంగా ఏపీకి ప్రత్యేకహోదా హామీపై ఇంత స్పష్టమైన మాట రాజ్‌నాథ్ నోటి నుంచి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వ్యాఖ్యలు ఏపీకి ప్రత్యేకహోదాపై కొత్త ఆశలు రేపేలా ఉన్నాయి. మరి.. ఆ శుభ ఘడియ ఎప్పటికి వస్తుందో చూడాలి.