Begin typing your search above and press return to search.

దేశ హోం మంత్రి భద్రతా ఏర్పాట్లు ఇలాగేనా...?

By:  Tupaki Desk   |   10 April 2015 4:18 AM GMT
దేశ హోం మంత్రి భద్రతా ఏర్పాట్లు ఇలాగేనా...?
X
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓ కార్యక్రమంలో పాల్గనడానికి వెళ్లి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. దాన్ని తెరవడం కుదరకపోవడంతో లిఫ్టు పైభాగాన్ని తొలగించి మరీ ఆయనను బయటకు తీయాల్సివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది. దీంతో సాక్షాత్తు దేశ హోం మంత్రి వెళ్లే దారిలో ప్రమాదాన్ని నివారించలేకపోవడం భద్రతలో డొల్లతనాన్ని బయటపెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రత అంటే బాంబు డిటెక్టర్లు.. జడ్‌ ప్లస్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణే కాదని.. ఇలాంటి ప్రమాదాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన అప్రమత్తం చేసింది.

వసంత్‌ కుంజ్‌లోని సెంటర్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) కార్యాలయంలో %''%శౌర్య దివస్‌%''% కార్యక్రమానికి హాజరయ్యేందుకు హోం మంత్రి వెళ్లారు. అక్కడ ఆయన ఎక్కిన లిఫ్టు కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. లిప్ట్‌లో ఆయనతో పాటు హోం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు, సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉన్నారు. దీంతో లిప్ట్‌ పైకప్పును తొలగించి వారందరినీ బయటకు తీశారు. ఈ ఆపరేషన్‌ లిప్ట్‌ కార్యక్రమంతో బయటకొచ్చిన తరువాత రాజనాథే ఈ సంగతి వెల్లడించారు.

తమిళనాడు నోరు మూయించేందుకు కొత్త పాయింట్‌ దొరికింది..

శేషాచలం ఎన్‌ కౌంటర్‌ తో తమిళనాట తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీకి ఇప్పుడు ఆ పార్టీ నేత ఒకరు ఆపద్భాంధవుడిలా కనిపిస్తున్నారు. నిజానికి ఈ సంఘటన నుంచి ఎలా డిఫెన్సు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న టీడీపీని కాపాడేలా ఆ పార్టీ నేత ఒకరు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఎర్రచందనం నరుకుతున్న 20 మందిని ఎన్‌ కౌంటర్‌ చేయడం తప్పయితే తమిళనాడు ప్రభుత్వం వీరప్పన్‌ను చంపడం కూడా తప్పే అవుతుందని తెలుగుదేశం పార్టీ నేత అన్నా రామచంద్రయ్య తమిళనాడు ఆందోళనకారుల వద్ద వాదించారు. తమిళనాడు ప్రభుత్వం గంధపు చెక్కల స్లగ్లర్‌ వీరప్పన్‌ను చంపిందని... అలాంటప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లను ఎన్‌ కౌంటర్‌ చేస్తే తప్పేంటని ఆయన వాదించారు. శేషాచలంలో ఎర్రచందనం పరిరక్షణకు టాస్క్‌ఫోర్సు అధికారులు చర్యలు చేపట్టారని.. తమపై దాడి చేయబోయే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఇది తప్పంటే.. వీరప్పన్‌ను చంపడమూ తప్పే అవుతుందని ఆయన అన్నారు. ఎర్రచందనం చెట్లు నరికేందుకు అడవిలోకి వస్తే చంపేస్తామని 9 నెలల కిందటే తమిళనాడంతా హెచ్చరికలు చేశారని ఆయన గుర్తుచేశారు. అయినా వారు రావడం మానలేదని, అడ్డుకునే పోలీసులపై తిరగబడ్డారని చెప్పారు.

అక్రమార్కులను అడ్డుకునేందుకు చట్టాలు ఉన్నాయని వాదిస్తున్న తమిళ వర్గాలు వీరప్పన్‌, ఆయన అనుచరులను వెంటాడి వేటాడి ఎందుకు చంపారో కూడా చెప్పాలని రామచంద్రయ్య నిలదీశారు. రామచంద్రయ్యకు గుర్తుకొచ్చిన ఈ పాత అంశం ఇప్పుడు చాలామంది టీడీపీ నేతలకు మాట్లాడేందుకు అస్త్రంగా మారింది.