Begin typing your search above and press return to search.
‘బుల్లెట్ల లెక్క మీద రాజ్ నాథ్ వార్నింగ్
By: Tupaki Desk | 14 Sep 2015 6:39 AM GMTపొరుగుదేశమైన పాకిస్థాన్ తీరుపై మాటల తూటాలు పేలుతున్నాయి. జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో మోర్టార్లు.. తూటాలు పేలుతుంటే.. రెండు దేశాల నేతల మధ్య మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. గతంలో మాదిరి కాశ్మీర్ విషయంలో ఆచితూచి కాక ఒకింత దూకుడుగానే పోతున్న కేంద్ర సర్కారు తాజాగా మరోసారి అదే పంథాను కొనసాగించింది.
తాజాగా.. పాక్ వైఖరిపై భోపాల్ లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలే చూస్తే.. గతంలో పాక్ మీద తమ తొలి తూటా పేలదని స్పష్టం చేసిన ఆయన.. తాజాగా అందుకు కొనసాగింపుగా కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొదటి తూటా తమది కాకున్నా.. తూటాలు పేల్చటం మొదలు పెడితే.. లెక్క వేయమని స్పష్టం చేశారు. శత్రుపక్షం మీద కాల్పులు మొదలు పెడితే.. పరిస్థితి మామూలుగా ఉండదన్న ఆయన.. పాక్ అధికారులకు భారత్ వైఖరిని ఈ మధ్య స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు.
తాము ఎవరినీ రెచ్చగొట్టమని.. కానీ.. తమను రెచ్చగొడితే మాత్రం ఎవరినీ వదిలిపెట్టమన్న విషయాన్ని పాక్ అధికారులకు స్పష్టం చేసినట్లు చెప్పిన రాజ్ నాథ్ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఎన్నిసార్లు చెప్పినా కాశ్మీర్ అంశాన్ని చర్చల్లోకి తెస్తున్నారని.. నిజానికి ఇప్పుడు చర్చించాల్సింది కాశ్మీర్ అంశం కాదని.. పాక్ అక్రమిత కాశ్మీర్ వ్యవహారమని పాక్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేసినట్లు చెప్పుకొచ్చారు. కాశ్మీర్ ఇప్పటికి.. ఎప్పటికీ భారత్ అంతర్భాగమేనని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
పదునైన మాటలు మాట్లాడటం.. కాశ్మీర్ పై విస్పష్ట విధానాన్ని వెల్లడించటం లాంటివి బాగానే ఉన్నా.. అంతకంటే ముందు.. కాశ్మీర్ పై పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందేమో.