Begin typing your search above and press return to search.
ఒక్క నమస్తే తో భారతీయుల మనసులు గెలుచుకున్న రాజ్‌నాథ్ !
By: Tupaki Desk | 3 Sep 2020 12:30 PM GMTకరోనా మహమ్మారి కారణంగా .. ప్రపంచ వ్యాప్తంగా మానవుల జీవన విధానంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కరోనా నియమాలని పాటిస్తున్నారు. ఈ సమయంలో భారతీయ సంప్రదాయంలో భాగమైన నమస్కారం ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అయ్యింది. ప్రతి ఒక్కరు హ్యాండ్ షేక్ బదులుగా నమస్కారాలు పెట్టుకుంటున్నారు. కాగా ప్రస్తుతం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో పర్యటిస్తున్నారు. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ముఖ్య కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్ నాథ్ వెళ్లారు.
రష్యా పర్యటనలో భాగంగా మాస్కో చేరుకున్న రాజ్ నాథ్ సింగ్ అక్కడి మేజర్ జనరల్ సెల్యూట్ చేయగా, రాజ్ నాథ్ మాత్రం నమస్కారం చేశారు. మరో సైనికాధికారి సైతం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అయన ప్రయత్నించగా రాజ్‌నాథ్ నమస్కారం చేయడంతో ఆ అధికారి సైతం నమస్కారం చేయడం గమనార్హం. మరో వైపు భారత్, రష్యా ద్వైపాక్షిక రక్షణ శాఖ బలోపేతం కావడానికి ఈ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. కాగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇరు దేశాల సహకరించుకోని బాగా ఉపయోగించారు. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో నమస్తే పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చినపుడు నమస్తే ట్రంప్ పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నమస్తే పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మొత్తంగా రష్యాలో రాజ్ నాథ్ నమస్తే పెట్టడం ద్వారా భారతీయుల మనసులు గెలుచుకున్నారు.