Begin typing your search above and press return to search.

నిన్న అమెరికా, నేడు ఇజ్రాయెల్ ..సరిహద్దు పోరులో భారత్ కి మద్దతు !

By:  Tupaki Desk   |   25 July 2020 11:30 PM GMT
నిన్న అమెరికా, నేడు ఇజ్రాయెల్ ..సరిహద్దు పోరులో భారత్ కి మద్దతు !
X
భారత్ -చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొద్దిగా తగ్గినప్పటికీ చైనాను పూర్తిగా నమ్మలేని పరిస్థితి. దొంగ దెబ్బ కొట్టడంతో చైనాను మించే దేశం మరొకటి లేదు. అలా దొంగ దెబ్బ కొట్టి గాల్వానా లోయ వద్ద 20 మంది భారత జవాన్ల ప్రాణాలని పొట్టనపెట్టుకుంది. దానికి బదులు తీర్చుకోవడానికి భారత్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. ఇప్పటికే చైనా కి చెందిన దాదాపు 59 యాప్స్ ను నిషేధించింది. అలాగే దేశంలో ఏ పెట్టుబడి పెట్టడానికి కూడా సరిహద్దు దేశాలకి అవకాశం లేకుండా సరికొత్త జీవో తీసుకువచ్చింది. ఇలా ఓ వైపు చైనాను దెబ్బకొడుతూనే ఆయుధ సంపదని పెంచుకుంటుంది. గల్వాన్ ఘటన తర్వాత చైనాకు వ్యతిరేకంగా భారత్ కు మద్దతు తెలుపుతున్న అమెరికా ఇప్పటికే కావాల్సిన ఆయుధాల్ని అందివ్వడానికి సిద్ధం అని తెలియజేసింది. తాజాగా ఇదే దారిలో అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఫ్రాన్స్ కూడా భారత్ కు అవసరమైన ఆయుధాలను అందించేందుకు పచ్చ జెండా ఉపుతున్నాయి.

ఇజ్రాయెల్ తో తాజాగా రాజ్ నాథ్ సింగ్ జరిపిన చర్చల్లో సానుకూల స్పందన వ్యక్తమైందని, ఇరుదేశాల మధ్య మిలిటరీ సహకారం మరింత పెంచుకునే దిశగా ముందడుగు పడిందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో సమీకరణాల నేపథ్యంలో అమెరికా స్నేహంతో భారీ ఎత్తున ఆయుధ సంపత్తిని, అత్యాధునిక సైనిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్న ఇజ్రాయెల్ దాన్ని భారత్ తో పంచుకునేందుకు సిద్ధమవుతోంది.భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా ఇజ్రాయెల్ రక్షణమంత్రి లెఫ్టినెంట్ కల్నల్ బెంజమిన్ గాంట్జ్ తో జరిపిన ఫోన్ సంభాషణలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. చైనాతో వివాదం రోజురోజుకి ముదురుతున్న నేపథ్యంలో అత్యవసరంగా ఆయుధాలు కావాలని కోరినట్లు సమాచారం. అలాగే అమెరికాకి మరో మిత్రదేశం అయిన ఫ్రాన్స్ తో చర్చలు జరుపుతున్నారు. దాదాపుగా ఫ్రాన్స్ కూడా భారత్ కి బాసటగా నిలవడానికి సై అంటుంది. అలాగే భారత్ ఒకప్పటి మిత్రుడు రష్యా కూడా భారత్ కు సహకరించేందుకు సిద్ధమేనన్న సంకేతాలు ఇస్తోంది. దీంతో భారత్ కూడా ఆచితూచి అడుగులేయాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా , ఫ్రాన్స్ పూర్తిగా మద్దతు ఇవ్వడానికి ఆయుధ సంపద ఇవ్వడానికి సిద్దమైన నేపథ్యంలో ఫ్రాన్స్, రష్యా పై దృష్టి పెట్టింది. అత్యాదునిక ఆయుధాల కోసం భారత్ ఆ దేశాల సాయం కోరుతుంది. ఫ్రాన్స్ , రష్యా నుండి అత్యాధునిక ఆయుధ సంపత్తి హామీ లభిస్తే ఇక భారత్ చైనాను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం అయినట్టే అని భావిస్తున్నారు.