Begin typing your search above and press return to search.
రజనీ పార్టీనే కాదు.. పక్కా ప్లాన్ రెఢీ..
By: Tupaki Desk | 10 Feb 2020 7:40 AM GMTరాజకీయాల పట్ల ఆసక్తిని తమిళ సూపర్ స్టార్ కమ్ తలైవా రజనీకాంత్ ఎప్పటినుంచో ప్రదర్శిస్తున్నారు. తాను పొలిటికల్ పార్టీని ప్రారంభిస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చినా.. ఈ మధ్యనే తాను పార్టీ పెట్టనున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తాము పని చేస్తామని చెప్పారు. కానీ.. ఇంతవరకూ పార్టీ ప్రారంభం కాలేదు.. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతున్న దాఖలాలు లేవు.
అదే సమయంలో కొన్ని అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన మాటలన్ని కూడా బీజేపీకి తగ్గట్లు ఉన్నాయన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. కమలనాథులకు మైక్ గా మారారని పలువురు తప్పు పడుతున్నా.. తలైవా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా తన పార్టీ ప్రారంభానికి సంబంధించిన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏప్రిల్ లో పార్టీని ప్రారంభిస్తారని చెబుతున్నారు.
అంతేకాదు.. పార్టీని ప్రారంభించిన వెంటనే పార్టీ నిర్మాణం మీద ఫోకస్ కంటే కూడా ప్రజలకు దగ్గరయ్యే అంశానికే ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా అలవాటైన పాదయాత్రను షురూ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తమిళనాడులో ఇటీవల కాలంలో ఏ నేత కూడా పాదయాత్ర చేసింది లేదు. ఆ లోటును పూడ్చటంతో పాటు.. ప్రజల్లోకి నేరుగా వచ్చేయటం ద్వారా కొత్త తరహా రాజకీయాన్ని రాష్ట్రానికి చూపించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
తన పాదయాత్ర కు సంబంధించిన ఆలోచనల్ని కొందరు ప్రజాసంఘాల వారితోనూ.. రాజకీయ ప్రముఖులతోనూ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. రాజకీయ పోరుతో ఒంటరిగా కాకుండా.. కొన్ని చిన్నపార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. బీజేపీతో ఆయన ఎలాంటి రిలేషన్ ను మొయింటైన్ చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రజనీ పొలిటికల్ పార్టీ గురించి ఓపక్క ఆసక్తికర చర్చ సాగుతున్న వేళ.. ఆయన్నురాజకీయాల్లోకి రావటానికి వ్యతిరేకించే వారు మాత్రం ఎప్పటిలానే..అంత సీన్ లేదని.. పొలిటికల్ పార్టీ పెట్టటం తమాషానా? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. ఇలాంటి వ్యాఖ్యలకు రజనీ ఎలాంటి సమాధానం చెబుతారన్నది కాలమే బదులివ్వాలి.