Begin typing your search above and press return to search.
రజనీ బెదరించినా సరే...ఐపీఎల్ ఆడిస్తాం
By: Tupaki Desk | 9 April 2018 5:49 PM GMTతమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా కావేరీ జలాల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 10న చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజా ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించవద్దన్న వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో చెన్నైలో ఐపీఎల్ నిర్వహణ సరికాదని సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అన్నారు. కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటుచేయడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా చెన్నైలో తమిళ సినీ ప్రముఖులు మౌన నిరసన చేపట్టారు. తమిళ చిత్ర నిర్మాతల మండలి(టీఎఫ్‌పీసీ) - సౌత్ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్(ఎస్ఐఏఏ) - దక్షిణభారత సినీ ఉద్యోగుల సంస్థ - డిస్ట్రిబ్యూటర్ల సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం వల్లువర్కొట్టమ్ లో మౌనంగా నిరసన తెలిపారు. రసనలో నటుడు కమల్ హాసన్ తో కలిసి పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితి గురించి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ ఆలోచించాలి. చెన్నైలో ఐపీఎల్ నిర్వహణకు ఇది సమయం కాదన్న వాస్తవాన్ని గుర్తించాలి అని చెప్పారు.
దీనిపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఐపీఎల్ రద్దు చేసే అయితే అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టంచేశారు. మంగళవారం చెన్నై, కోల్‌కతా మ్యాచ్ కూడా చెన్నైలోనే జరుగుతుందని ఆయన చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడామని, తగిన భద్రత కల్పిస్తామని వాళ్లు హామీ ఇచ్చినట్లు శుక్లా తెలిపారు. `చెన్నై మ్యాచ్‌ను తరలించలేదు. ఏప్రిల్ 10న చెన్నైలోనే ఆ మ్యాచ్ ఉంటుంది. తగిన భద్రత కల్పిస్తామని అధికారులు చెప్పడంతో అక్కడే మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించాం. దయచేసి ఐపీఎల్‌ను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు` అని శుక్లా అన్నారు.
కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా కొన్ని రోజులుగా తమిళనాడులో ఆందోళనలను మిన్నంటుతున్నాయి. సినిమా స్టార్లు కూడా ఈ నిరసనల్లో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఐపీఎల్ నిర్వహణను కమల్‌హాసన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. నటి కుష్బు, నటులు విశాల్, విజయ్, ధనుష్, కార్తి, సత్యరాజ్, దర్శకులు శంకర్ - విక్రమన్ - సంగీత దర్శకుడు ఇళయరాజా తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళ రైతులకు అప్పులు పెరిగి - ఆకలితో అలమటిస్తుంటే.. ఐపీఎల్ నిర్వహిస్తుండటాన్ని అధికార ఏఐఏడీఎంకేతోపాటు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు.