Begin typing your search above and press return to search.
అభిమానులను టెన్షన్లో పెట్టేసిన రజినీ
By: Tupaki Desk | 30 Nov 2020 2:50 PM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయంపై చర్చ ఈనాటిది కాదు. రెండు దశాబ్దాల నుంచి నడుస్తున్న వ్యవహారమిది. అసలు రాజకీయాల్లోకి వస్తానో లేదో చెప్పడానికి కూడా ఆయనకు చాలా ఏళ్లు సమయం తీసుకున్నారు. చివరికి జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు చనిపోయాక కానీ రజినీకి ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు ధైర్యం రాలేదు. ఐతే ఆ తర్వాత అయినా వెంటనే పార్టీ మొదలుపెట్టి రంగంలోకి దిగాడా అంటే అదీ లేదు. రాజకీయాల్లోకి వస్తా, పార్టీ పెడుతున్నా అన్నాడే తప్ప కార్యాచరణ లేదు. ఈ మధ్య చూస్తే అనారోగ్య సమస్యలని, కరోనాకు భయపడుతున్నాడని, ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి రావడంపై పునరాలోచిస్తున్నారని వార్తలొచ్చాయి. ఇలాంటి తరుణంలో తన అభిమానులతో సమావేశం నిర్వహించారు రజినీ. ఈ సమావేశం తర్వాత వెంటనే రాజకీయారంగేట్రంపై స్పష్టమైన ప్రకటన చేస్తారనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.
సోమవారం చెన్నైలోని కోడంబాక్కంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ కు చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో సమావేశం నిర్వహించారు రజినీ. తమిళనాడులోని 38 జిల్లాలకు చెందిన 52 మంది రజనీ పార్టీ అభిమాన సంఘాల ముఖ్య నాయకులు, రజనీ మక్కల్ మండ్రం పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరైనారు. మీటింగ్ పూర్తి అయిన తరువాత తలైవా రజనీకాంత్ ఏం ప్రకటన చేస్తారా అని ఉత్కంఠతో చూశారు అభిమానులు. ఐతే ఈ సమావేశానంతరం బయటకు వచ్చిన రజనీకాంత్ చెనైలోని పూజా గార్డెన్ లో మీడియాతో మాట్లాడారు. తన అభిమాన సంఘాల నాయకులతో మాట్లాడానని.. వారి అభిప్రాయాలు సేకరించానని.. తన రాజకీయ రంగప్రవేశం గురించి త్వరలో పూర్తి సమాచారం వెల్లడిస్తానని రజినీ చెప్పారు. ఏ నిర్ణయమైనా అభిమానులు తనకే వదిలేసినట్లు రజినీ తెలిపారు. ఐతే ఇంకా నాన్చితే బాగోదని రజినీకి అర్థమై ఉంటుంది కాబట్టి ఒకట్రెండు రోజుల్లోనే ఆయన తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టేదీ లేనిది వెల్లడిస్తూ ఏదో ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.