Begin typing your search above and press return to search.

మ‌హిళ‌ల‌ అబార్ష‌న్ల‌పై కీల‌క బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం!

By:  Tupaki Desk   |   16 March 2021 5:30 PM GMT
మ‌హిళ‌ల‌ అబార్ష‌న్ల‌పై కీల‌క బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం!
X
గ‌ర్భ‌స్థ శిశువు లింగ నిర్ధార‌ణే నేర‌మ‌న్న సంగ‌తి చాలా మందికి తెలుసు.. కానీ, నిర్ణీత గ‌డువు త‌ర్వాత అబార్ష‌న్ చేసినా నేర‌మే! దాన్ని కూడా హ‌త్య కోణంలోనే చూస్తుంది చ‌ట్టం. అయితే.. ఈ చ‌ట్టానికి సంబంధించి ప‌లు మార్పులు చేప‌ట్టింది ప్ర‌భుత్వం.

ఇందుకు సంబంధించిన స‌వ‌ర‌ణ‌ బిల్లు.. ప్ర‌స్తుత‌ స‌మావేశాల్లో పార్ల‌మెంటు ముందుకు వ‌చ్చింది. ఈ బిల్లుపై చ‌ర్చించిన రాజ్య‌స‌భ దాన్ని ఆమోదించింది. ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌ర్భ‌స్రావం చేయించుకునే స‌మయాన్ని పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న చ‌ట్టం ప్ర‌కారం.. గ‌ర్భం మొద‌లైన త‌ర్వాత 20 వారాల వ‌ర‌కు మాత్ర‌మే అబార్ష‌న్ చేయించుకునే వెసులుబాటు ఉంది. ఆ త‌ర్వాత అబార్ష‌న్ చేయించ‌డానికి అనుమ‌తి లేదు. అయితే.. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఈ గ‌డువును 24 వారాల వ‌ర‌కు పెంచారు.ప్ర‌ధానంగా.. అత్యాచార బాధితులు, మైన‌ర్లు, దివ్యాంగులైన మ‌హిళ‌ల కోసం కేంద్రం ఈ మార్పులు చేప‌ట్టింది. వారు అనివార్య కార‌ణాల వ‌ల్ల గ‌ర్భం దాల్చిన‌ప్పుడు ఈ విధంగా గ‌ర్భస్రావం చేయించుకోవడానికి అవ‌కాశం క‌ల్పిస్తోందీ బిల్లు.