Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ ర‌చ్చ‌.. మోడీ ఇలా.. ప్ర‌తిప‌క్షాలు అలా.. ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   13 Aug 2021 3:21 AM GMT
రాజ్య‌స‌భ ర‌చ్చ‌.. మోడీ ఇలా.. ప్ర‌తిప‌క్షాలు అలా.. ఏం జ‌రుగుతుంది?
X
పెద్ద‌ల స‌భ.. చిన్న‌బోయిందా? స‌భ‌లో బుధ‌వారం చోటు చేసుకున్న ప‌రిణామాల త‌ర్వాత‌.. దేశ‌వ్యాప్తంగా వినిపించిన మాట ఇదే! నిజానికి లోక్‌స‌భ‌లో వివాదాలు.. విమ‌ర్శ‌లు.. ప‌ర‌స్ప‌ర దాడులు.. పేప‌ర్లు(బిల్లులు) చింపేయ‌డాలు.. విసిరికొట్ట‌డాలు.. వంటివి కామ‌న్‌గా జ‌రుగుతుంటాయి. కానీ, రాజ్య‌స‌భ విష‌యానికి వ‌స్తే.. పెద్ద‌ల స‌భగా పేరున్న నేప‌థ్యంలో ఈ స‌భ‌లో వ్య‌వ‌హారాలు అన్నీ కూడా ఆచితూచి జ‌రుగుతాయ‌ని అంటా రు. వాస్త‌వానికి కొన్ని ద‌శాబ్దాలుగా ఇదే జ‌రుగుతోంది. కానీ, కొన్నేళ్లుగా రాజ్య‌స‌భ‌లోనూ. .. వివాదాలు కామ‌న్ అయ్యాయి.

హెచ్చ‌రించినా.. బేఖాత‌ర్‌..

రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఉప‌రాష్ట‌ప‌తి వెంక‌య్యనాయుడు.. ఒక‌టి రెండు సంద‌ర్భా ల్లో.. స‌భ‌లో వ్య‌వ‌హారాల‌పై ఆవేద‌న‌వ్య‌క్తం చేశారు. పెద్ద‌ల స‌భ చిన్న‌బోయేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దంటూ.. హెచ్చరించారు. అయిన‌ప్ప‌టికీ.. రాజ్య‌స‌భ‌లో అప్పుడ‌ప్పుడు.. వివాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌ధానంగా.. బుధ‌వారం చోటు చేసుకున్న ప‌రిణామాలు.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీశాయి. వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో .. అధికార ప‌క్షం బీజేపీ.. ప్ర‌తిప‌క్షాలు.. కాంగ్రెస్ ఇత‌ర పార్టీలు.. వ్యూహ ప్ర‌తివ్యూ హాల‌తో ముందుకు సాగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అధికార ప‌క్షంపై పైచేయి సాధించేందుకు విప‌క్షాలు.. విప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేసేందుకు అధికార ప‌క్షం ప్ర‌య‌త్నించాయి.

అధికార ప‌క్షం దూకుడు

వ‌ర్షాకాల స‌మావేశాల్లో బీజేపీ ఒకింత దూకుడుగానే ముందుకు సాగింది. కీల‌క‌మైన బిల్లులను ఆమోదిం చుకుని తీరాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో విప‌క్షాలు ప‌ట్టుబ‌ట్టి.. రైతు చ‌ట్టాల‌పై చ‌ర్చ‌కు, స్పై వేర్‌.. పెగాస‌స్‌పై చ‌ర్చ‌కు ఉభ‌య స‌భ‌ల్లోనూ అనుమ‌తి ల‌భించ‌క‌పోగా.. కీల‌క‌మైన బిల్లుల‌ను స‌భ అంత‌రాయాల న‌డుమే మోడీ స‌ర్కారు ఆమోదించుకుంది. దీంతో విప‌క్షాలు అనూహ్యంగా పెద్ద‌ల స‌భ‌లో(బీజేపీకి బ‌లం లేదు) దూకుడు చూపించాయి. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం నాటి స‌భ‌లో పెగాస‌స్ స‌హా రైతు చ‌ట్టాల‌పై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టాయి. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.

వాయిదాల‌పై వాయిదాలు..

పెగాసస్ సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో బుధ‌వారం రాజ్య‌స‌భ ప్రారంభం నుంచే వాయిదాలు ప‌డింది. పలు వాయిదాల తర్వాతా నిరసనల మధ్యే ఓబీసీ బిల్లు (127వ రాజ్యాంగ సవరణ బిల్లు)పై చర్చను చేపట్టి ఆమోదించుకున్నారు. ఆ వెంట‌నే.. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను ప్రైవేటీకరించేందుకు ఉపకరించే బీమా బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ చర్యను నిరసిస్తూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ఒక్క‌సారిగా రాజ్య‌స‌భ‌లో అలజ‌డి రేగింది. దీంతో గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు.. అనుమ‌తితో.. మార్షల్స్ రంగంలోకి దిగారు.

మ‌హిళా ఎంపీల‌ను కొట్టారా?!

మహిళా ఎంపీలు నిరసన తెలిపే దగ్గర పురుష భద్రతా సిబ్బందిని, పురుష ఎంపీలు నిరసన తెలుపుతు న్న చోట మహిళా భద్రతా సిబ్బందిని అడ్డుగా ఉంచారు. ఈ క్రమంలోప్రతిపక్ష సభ్యులు బిల్లు కాగితాలను చించి చైర్‌ పైకి, సభ అధికారులపైకి విసిరేశారు. మార్షల్స్ తో ఎంపీల పెనుగులాట చోటుచేసుకున్నాయి. దీంతో .. పురుష మార్షల్స్‌ తమపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీలు ఛాయా వర్మ, ఫులో దేవీ నేతమ్‌ ఆరోపించారు. అంతేకాదు.. మార్ష‌ల్స్ పేరుతో బ‌య‌ట వారిని ర‌ప్పించార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌ల‌కు నిర‌స‌న‌గా.. కాంగ్రెస్ నాయ‌కురాలు.. సోనియాగాంధీ నేతృత్వంలో గురువారం.. ప్ర‌తిప‌క్ష పార్టీల స‌భ్యులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌ను కొట్టిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. చైర్మ‌న్ వెంక‌య్య‌కు సైతం ఫిర్యాదు చేశారు.

వెంక‌య్య కంట‌త‌డి!

ఇదిలావుంటే.. రాజ్య‌స‌భ‌లో బుధ‌వారం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై చైర్మ‌న్ వెంక‌య్య కంట‌త‌డి పెట్టారు. పెద్ద‌ల స‌భ ప‌రువు పోయింద‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం రాజ్య‌స‌భ ఘ‌ట‌న తో డిఫెన్స్ లో ప‌డింది. ఈ విష‌యంలో త‌మ త‌ప్పులేద‌ని.. బ‌య‌టి వ్య‌క్తులు ఎవ‌రూ కూడా స‌భ‌లోకి రాలే ద‌ని.. విప‌క్ష స‌భ్యులే మార్ష‌ల్స్‌పై చేయి చేసుకున్నార‌ని.. వ‌రుస‌గా మంత్రులు ఎదురు దాడి చేశారు. అంతేకాదు.. స‌భ‌లో ఏం జ‌రిగిందో.. అంతా ఫుల్లు ఫుటేజీని మీడియా కు విడుద‌ల చేశారు. దాదాపు రెండున్న‌ర నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోలో.. రాజ్య‌స‌భ‌లో వ్య‌వ‌హ‌రించిన తీరు మొత్తం ఉంది. ఈ నేప‌థ్యంలో విప‌క్ష స‌భ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకునేలా.. చైర్మ‌న్‌ను కోర‌తామ‌ని ప్ర‌క‌టించారు. మొత్తంగా చూస్తే.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో పార్ల‌మెంటులో త‌లెత్తిన ఈ వివాద తుఫాన్ ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.