Begin typing your search above and press return to search.

త‌న మాట‌ల‌తో కాంగ్రెస్‌ కు షాకిచ్చిన మ‌న్మోహ‌న్‌

By:  Tupaki Desk   |   7 April 2017 4:59 AM GMT
త‌న మాట‌ల‌తో కాంగ్రెస్‌ కు షాకిచ్చిన మ‌న్మోహ‌న్‌
X
గేమ్ ను పూర్తిగా మార్చే నిర్ణ‌యాలు ప్ర‌భుత్వాలు చాలా అరుదుగా తీసుకుంటుంటాయి. అంత పెద్ద మార్పును రాజ‌కీయ పార్టీలు ఓకే అన‌టం అంత తేలికైన విష‌యం కాదు. గ‌డిచిన కొన్నేళ్లుగా వ‌స్తు-సేవ‌ల ప‌న్ను సింఫుల్ గా చెప్పాలంటూ జీఎస్టీని చ‌ట్టంగా తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నాలు జ‌రిగినా.. అది సాకారం కాలేదు. తాజాగా.. జీఎస్టీకి సంబంధించిన నాలుగు బిల్లుల్ని టోకుగా ఆమోదిస్తూ పెద్ద‌ల స‌భ ఆమోదముద్ర వేసింది. వాస్త‌వానికి రాజ్య‌స‌భ‌లో మోడీ స‌ర్కారుకు పూర్తిస్థాయిలో మెజార్టీ లేదు. కానీ.. ఈ బిల్లు ఆమోద‌ముద్ర ప‌డ‌టం.. అది అమ‌ల్లోకి రావ‌టం త‌ప్ప‌నిస‌రి అయిన వేళ‌..రాజ‌కీయ పార్టీలు రాజ‌కీయాల‌కు అతీతంగా ఓకే అన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

ఈ బిల్లుకు రాజ్య‌స‌భ‌లో ఆమోద‌ముద్ర వేసేందుకు కాంగ్రెస్ నేత‌లు కాస్త ప్ర‌య‌త్నించినా.. ఊహించ‌ని రీతిలో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ అనుసరించిన విధానంతో కాంగ్రెస్ నేత‌లు కిక్కుర‌మ‌న‌లేని ప‌రిస్థితి. జీఎస్టీబిల్లుకు టి. సుబ్బిరామిరెడ్డి.. జైరాం ర‌మేశ్ లాంటి వారు చాలానే మార్పులు చేర్పులు చేప‌ట్టాల‌న్న సూచ‌న‌లు చేశారు. కానీ.. అలాంటివేమీ వ‌ద్ద‌ని.. జీఎస్టీ బిల్లుకు ఎలాంటి స‌వ‌ర‌ణ‌లు వ‌ద్దంటూ మ‌న్మోహ‌న్ సింగ్ గ‌ళం విప్ప‌టంతో కాంగ్రెస్ నేత‌లు కామ్ అయ్యారు. ఇదే విష‌యాన్ని జైరాం ర‌మేశ్ చెప్ప‌టం గ‌మ‌నార్హం.

జీఎస్టీ మండ‌లిలో అన్ని రాష్ట్రాలూ నూత‌న స‌మాఖ్య స్ఫూర్తిగా ఏకాభిప్రాయానికి వ‌చ్చాయ‌ని.. వీటికి విఘాతం క‌లిగించేలా ఎలాంటి స‌వ‌ర‌ణ‌ల్ని ప్ర‌తిపాదించొద్ద‌ని మ‌న్మోహ‌న్ త‌న‌కు చెప్పిన‌ట్లుగా చెప్పారు. జీఎస్టీ బిల్లుకు కొన్ని మార్పుల్ని తృణ‌మూల్‌కాంగ్రెస్ ఎంపీ కోర‌గా.. అలా చేస్తే.. మ‌ళ్లీ బిల్లు అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఆమోదం పొందాల్సిఉంటుంద‌ని.. ఆ కార‌ణంతో మార్పులేమీ లేకుండా ఆమోదం ప‌ల‌కాల్సిన అవ‌స‌రంఉంద‌న్న మాట‌ను చెప్పారు.

జైట్లీ మాట‌కు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ద‌న్నుగా నిల‌వ‌టంతో జీఎస్టీ బిల్లులో ఎలాంటి మార్పులు లేకుండా రాజ్య‌స‌భ ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఓకే చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. రాజ్య‌స‌భ‌లో ఎనిమిది గంట‌ల పాటు చ‌ర్చ జ‌రిగిన అనంత‌రం జీఎస్టీ బిల్లుఎలాంటి మార్పులు లేకుండా ఆమోదం పొంద‌టంపై ఆర్థిక‌మంత్రి జైట్లీ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ బిల్లును తీసుకొచ్చింది ఏ ఒక్క ప్ర‌భుత్వ‌మో.. పార్టీనో కాదు.. ఇది స‌మిష్టి విజ‌య‌మ‌ని వ్యాఖ్యానించినా.. రాజ‌కీయాల‌కు అతీతంగా మ‌న్మోహ‌న్ సింగ్ లాంటి వారు చొర‌వ తీసుకోవ‌టంతోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్లు ఓకే అయ్యింద‌న్న‌విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. బిల్లు ఆమోదం పొంద‌టంలో మ‌న్మోహ‌న్ సింగ్ పాత్ర ఎంత‌న్న విష‌యాన్ని తెలియ‌జేసేలా.. మంత్రి జైట్లీ.. జీఎస్టీ బిల్లు స‌భ ఆమోదం పొందిన త‌ర్వాత వారి వ‌ద్ద‌కు వ‌చ్చి థ్యాంక్స్ చెప్ప‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/