Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కి రాజ్యసభ కోటా... జగన్ మార్క్ సర్ ప్రైజ్... ?
By: Tupaki Desk | 10 Feb 2022 11:30 AM GMTముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా. ఈసారి రాజ్యసభ సీట్లకు ఎంపిక విషయంలో టాలీవుడ్ కి ప్రాముఖ్యత ఇస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. రాజ్యసభ టికెట్ ని మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్ చేశారని ఆ మధ్య ప్రచారం సాగింది. దానికి చిరంజీవి ఖరాఖండీగా బదులు ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి రాను అని, అది ముగిసిన అధ్యాయం అని కూడా పక్కా క్లారిటీ ఇచ్చారు.
ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటిదాకా చూస్తే పెద్దగా సినీ రంగం మద్దతు వైసీపీకి లేదు అన్నది తెలిసిందే. 2019 ఎన్నికల్లో కూడా చిన్న నటులు తప్ప పెద్ద వారు, స్టార్లు ఎవరూ వైసీపీ వైపు చూడలేదు. అయినా 151 సీట్ల మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత కూడా ఆయనకు అభినందనలు కూడా సినీ సీమ నుంచి పెద్దగా లేవు అని అని వైసీపీ నేతలు బాధపడిన సందర్భాలు ఉన్నాయి.
ఇక సినీ పెద్దగా, చరిష్మాటిక్ స్టార్ గా ఉన్న చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి దగ్గర చేసుకోవాలన్న ఆ పార్టీ ఎత్తుగడ చేసిందని ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యం కాదని తేలిపోయిన వేళ మైనారిటీ కార్డు తో పాటు సినీ రంగాన కమెడియన్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న అలీని ముందు పెట్టి టాలీవుడ్ తో గ్యాప్ ని తగ్గించుకోవాలని వైసీపీ భావిస్తోంది అంటున్నారు.
ఈ క్రమంలో అలీకి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ చేస్తారు అని చెబుతున్నారు. సినీ ప్రముఖులతో జగన్ జరిపిన భేటీకి అలీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అలీని జగన్ మళ్లీ మనం కలుద్దామని చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఈ మళ్లీ కలుద్దాం అన్న మాట అయితే ఇపుడు తెగ వైరల్ అవుతోంది. జగన్ అలీని కలుద్దామని అన్నారూ అంటే కచ్చితంగా రాజ్యసభ సీటు ఆఫర్ కే అని ప్రచారం గట్టిగా సాగుతోంది
నిజానికి అలీ ఎమ్మెల్సీ పదవిని కోరుకున్నారు. ఇప్పటికి మూడు విడతలుగా ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అయ్యాయి. ఆ మధ్య అయితే ఎమ్మెల్సీ ఖాళీల ఎంపికకు ముందే అలీ జగన్ని కలసి వచ్చారు. మర్యాదపూర్వకమైన భేటీ ఇది అని నాడు చెప్పినా తన మనసులో మాటను సీఎం చెవిన అలీ వేసి వచ్చారు అని ప్రచారం జరిగింది.
అయితే ఎమ్మెల్సీ పోస్టులలో జగన్ పార్టీ విధేయులకే కట్టబెట్టారు. ఇపుడు రాజ్య సభ చాన్స్ వచ్చింది. దాంతో చాలా మంది బిగ్ షాట్స్ కన్ను పడింది. తమకంటే తమకు వస్తుందని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో సడెన్ గా అలీ పేరు తెర మీదకు రావడం విశేషం.
ఇక అలీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆనాడు ఆయన ఎమ్మెల్యే టికెట్ కోరుకున్నారు. రాజమండ్రీకి చెందిన అలీకి టికెట్ కేటాయించలేకపోయారు. దాంతో అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పారు. దానికి తగిన విధంగా ఇపుడు పెద్దల సభలో అలీ అడుగుపెట్టబోతున్నారు అని అంటున్నారు.
ఎమ్మెల్సీగా నెగ్గి మంత్రి పదవి చేపట్టాలని ఉర్రూతలూరుతున్న అలీకి రాజ్యసభ పదవి అంటే ఒక విధంగా ఆనందకరమే అని చెప్పాలి. ఆరేళ్ల పాటు హాయిగా అలీ పెద్దల సభలో ఉండవచ్చు. మొత్తానికి చూస్తే అలీకి పదవి ఇవ్వడం ద్వారా సినీ రంగాన్ని గౌరవించాలన్న జగన్ ఆలోచన కూడా ఉంది. అదే సమయంలో పార్టీలో చేరి విధేయతగా ఉంటే కచ్చితంగా టాలీవుడ్ వారికి మరిన్ని పదవులు ఇస్తామన్న సంకేతం కూడా ఉంది అంటున్నారు.
ఇక సినీ రంగంతో ఇపుడిపుడే మంచి సంబంధాలు నెలకొంటున్న నేపధ్యంలో దాన్ని మరింతగా పటిష్టం చేసుకోవాలన్న ఆలోచన కూడా వైసీపీకి ఉందని అంటున్నారు. అందుకే అలీకి రాజ్య సభ సీటు ఆఫర్ అని చెబుతున్నారు. ఇక వైసీపీకి రాజ్యసభలో ప్రస్తుతం ఆరుగురు ఎంపీలు ఉన్నారు. అయితే మైనారిటీ కోటాలో అయితే ఎవరూ లేరు. దాంతో ఆ కోటాను భర్తీ చేయడంతో పాటు అలీ సేవలను వచ్చే ఎన్నికలలో కూడా పూర్తిగా వినియోగించుకోవాలన్న దూరాలోచన కూడా ఉంది అంటున్నారు.
అదే విధంగా రానున్న రోజుల్లో సినీ రంగానికి కూడా పదవుల పంపిణీలో చోటు ఉంటుందని చాటి చెప్పడానికే అలీతో శుభారంభం చేయాలని అనుకుంటున్నారుట. మొత్తానికి సమీకరణలు రాజకీయ ఆలోచనలు ఎలా ఉన్నా అలీకి కనుక రాజ్యసభ దక్కితే మాత్రం ఆయన ఊహించని అతి పెద్ద పదవి అదే అవుతుంది. పైగా టాలీవుడ్ కి కూడా ఒక కీలకమైన పదవి దక్కినట్లుగా ఉంటుంది.