Begin typing your search above and press return to search.
తెదేపా దెబ్బ : తలాక్ బిల్లు అటకెక్కినట్టే!
By: Tupaki Desk | 4 Jan 2018 4:15 AM GMTముస్లిం మహిళలకు తిరుగులేని భద్రతను కల్పించేస్తుందని... మూడు సార్లు తలాక్ అంటే చాలు.. వివాహ బంధాన్ని పుటుక్కుమని తెంచేసుకుని భార్య సంగతి గాలికొదిలేసి విచ్చలవిడిగా ప్రవర్తించేవారి అకృత్యాలకు బ్రేక్ పడుతుందని.. అలాంటి వారిని శిక్షించేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తలాక్ బిల్లు ప్రస్తుతానికి అటకెక్కినట్టే. మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు కొన్ని సంవత్సరాలుగా పార్లమెంటు ఆమోదం పొందకుండా మగ్గిపోతున్న తరహాలోనే... ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికి - వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఉద్దేశించిన బిల్లుగా పేరు తెచ్చుకున్న తలాక్ బిల్లు కూడా ప్రస్తుతం చట్టం కాకుండా అటక ఎక్కిపోతోంది. కాకపోతే.. ఈ పాపంలో తెలుగుదేశం పార్టీ కూడా తన వంతు పాత్ర పోషించడమే విశేషం.
మూడుసార్లు తలాక్ చెప్పే వారికి జైలు శిక్ష విధించే విధంగా.. కేంద్రం ప్రభుత్వం రూపొందించిన తలాక్ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు రాజ్యసభలో ఈ బిల్లుగురించి నానా గందరగోళం సాగింది. దీనిని పార్లమెంటరీ కమిటీకి నివేదిస్తే తప్ప చర్చ సాగించడానికి వీల్లేదంటూ కాంగ్రెస్ సహా తృణమూల్ - సమాజ్ వాదీ పార్టీలు పట్టుబట్టాయి. ఆశ్చర్యకరంగా ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం కూడా వారి వాదనకే జై కొట్టింది.
ఆల్రెడీ లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లును మళ్లీ పార్లమెంటరీ కమిటీకి పంపడం కుదరదని జైట్లీ చెప్పబోయినా ఎవరూ పట్టించుకోలేదు. ముస్లిం మహిళలకు భద్రత ఇచ్చే బిల్లు చట్టంగా మారడంలో తెలుగుదేశం పార్టీ కూడా అడ్డుపడుతున్నదా అనే చర్చ మొదలైంది.
అయితే తమాషా ఏంటంటే.. తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టే వ్యవహారం కొన్ని రోజులుగా నానుతూనే ఉంది. నాలుగైదు రోజులనుంచి ‘‘ఇవాళ రాజ్యసభకు తలాక్ బిల్లు’’ అనే వార్తలు ప్రతిరోజూ వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు.. పార్లమెంటు సమావేశాలు మరో రెండు రోజుల్లో ముగిసిపోతున్నాయనగా.. బుధవారం ప్రభుత్వం దాన్ని సభలో పెట్టింది. ప్రతిపక్షాలు మరియు తెదేపా పార్లమెంటరీ కమిటీ పరిశీలన డిమాండ్ చేయడంతో మళ్లీ సందిగ్ధంలో పడింది. కాకపోతే.. కమిటీకి నివేదించడం వారి ఆమోదం వంటి సాంకేతిక అంశాలు రెండురోజుల్లో పూర్తయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. దీంతో.. ఈ పార్లమెంటు సమావేశాల్లో... తలాక్ బిల్లు గట్టెక్కే అవకాశమే లేదని నిపుణులు భావిస్తున్నారు. కీలకమైన ఈ బిల్లు ఇలా ఆగిపోవడానికి తెలుగుదేశం దెబ్బ కూడా ఒక కారణం అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి ముస్లిం మహిళలకు చంద్రబాబు పార్టీ ఎలాంటి సంజాయిషీ చెప్పుకుంటుందో చూడాలి.