Begin typing your search above and press return to search.

మోడీపై పీకే అస్త్రం.. మమతా రెడీ

By:  Tupaki Desk   |   29 Feb 2020 1:43 PM GMT
మోడీపై పీకే అస్త్రం.. మమతా రెడీ
X
బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దేశంలోనే నంబర్ 1 రాజకీయ వ్యూహకర్త.. మోడీ నుంచి జగన్, నిన్నటి కేజ్రీవాల్ వరకూ అందరినీ ఎన్నికల్లో గెలిపించి రాజకీయ వ్యూహ చతురతల్లో ఆరితేరాడు.

అయితే మోడీకి వ్యతిరేకంగా సీఏఏను విమర్శించడం.. ఢిల్లీలో కేజ్రీవాల్ తో జట్టు కట్టి బీజేపీని ఓడించడం సంచలనంగా మారింది. దీనిపై సీరియస్ అయిన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇటీవలే ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. మోడీతో స్నేహం చెడకూడదని పీకేను దూరం పెట్టాడు.

అయితే ప్రశాంత్ మాత్రం పార్టీ నుంచి బహిష్కరింపబడినా కూడా మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా కొనసాగుతున్నారు. వచ్చే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని గెలిపించే బాధ్యతను భుజానవేసుకున్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాల్ లో లాబీయింగ్ చేస్తున్నారు.

అయితే తాజాగా వచ్చే నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీపడుతున్నాడు. పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నిలబడుతున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ను టీఎంసీ తరుఫున అభ్యర్థిగా రాజ్యసభకు పంపడానికి మమతా బెనర్జీ డిసైడ్ అయినట్టు సమాచారం.

మోడీకి సరిజోడు.. గట్టిగా నిలదీసే తెగువ పీకేలో ఉండడంతో ఆయనను తమ పార్టీ నుంచి రాజ్యసభకు పంపాలని.. తద్వారా వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో పీకే సాయం తీసుకోవాలని మమత ప్లాన్ చేసినట్టు తెలిసింది.

తృణమూల్ కు చెందిన నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో చురుకైన బీజేపీ వ్యతిరేకులను వెతికి మరీ రాజ్యసభకు పంపాలని మమతా బెనర్జీ యోచిస్తోంది. అందులో భాగంగానే పీకేను సెలెక్ట్ చేసినట్టు తెలిసింది. తద్వారా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ను ప్రశాంత్ కిషోర్ ద్వారా నడిపించాలని మమతా భావిస్తున్నారట.. మిగతా రెండు సీట్లను దినేష్ త్రివేది, మౌసం నూర్ కు మమత కేటాయించారు. ఇక ఐదో అభ్యర్థి కాంగ్రెస్, సీపీఎం-టీఎంసీలు కలిస్తే పంచుకోవచ్చు.