Begin typing your search above and press return to search.

రాజ్యసభకు కవిత.. ఖాయం చేసిన కేసీఆర్?

By:  Tupaki Desk   |   28 Feb 2020 8:00 AM GMT
రాజ్యసభకు కవిత.. ఖాయం చేసిన కేసీఆర్?
X
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ లో రెండు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ రెండు సీట్లు గులాబీ పార్టీ ఖాతాలోకే.. మరి కేసీఆర్ ఎవరికి ఇవ్వబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడి పార్టీ , ప్రజల్లో కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కూతురు కవితను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో ఓడడంతో కవిత ముభావంగా ఉంటున్నారు. ఆమె రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నారు. తెలంగాణ నుంచి ఇద్దరిలో కవితకు ఒక రాజ్యసభ బెర్త్ ఖాయమైందని టీఆర్ఎస్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. మరో అభ్యర్థిత్వానికి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గరికపాటి మోహన్ రావు, కేవీపీల పదవీకాలం ముగుస్తోంది. రెండు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 13వ తేదీన నామినేషన్లు దాఖలుకు ఆఖరు తేది. ఈ క్రమంలోనే మరో 15రోజులే ఉండడంతో కేసీఆర్ ఈ రెండు స్థానాల్లో ఒకటి కూతురు కవితకు ఇచ్చారని సమాచారం. కవితను మళ్లీ పార్టీలో యాక్టివ్ చేయాలంటే ఆమెకు పదవి ఉండడం ఖాయమని ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఇక పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేకేకు కూడా కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆయనను కూడా రాజ్యసభ కు మళ్లీ పంపిస్తారని తెలుస్తోంది.

ఇక వీరిద్దరే కాదు.. కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పేర్లు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఇందులో ఒకటి గిరిజనులకు ఇవ్వడం ఖాయం. మాజీ ఎంపీ సీతారాం నాయక్ రేసులో ఉన్నారు.