Begin typing your search above and press return to search.
ఆ ఎంపీ హడావుడితో.. ప్రత్యర్థి పార్టీలో ఒకరికి ఎంపీ సీటు
By: Tupaki Desk | 10 Jun 2022 11:30 PM GMTతెలంగాణలో ఇటీవల రాజ్యసభ ఎంపీల భర్తీ జరిగిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ మూడు ఎంపీ స్థానాలనూ తన ఖాతాలో వేసుకుంది. ఏకగ్రీవంగా వీరంతా ఎంపికయ్యారు. ఇందులో విశేషమేమీ లేదు. ఎన్నిక ప్రక్రియ సాధారణంగా సాగిపోయింది. అయితే, కాంగ్రెస్, బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికయ్యేంత సంఖ్యా బలం రాష్ట్రంలో ఆ పార్టీలకు లేదు. దీంతో వాటి తరఫున నామినేషన్లు కూడా దాఖలు కాలేదు.
మరోవైపు అనూహ్యంగా బీజేపీ నుంచి ఒకరికి ఎంపీ స్థానం దక్కింది. అది కూడా ఉత్తరాదిలోని ప్రబల ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ నుంచి కావడం విశేషం. ఇదంతా ఎవరూ ఊహించనిదే కాక.. అసలు ఆ పార్టీ తెలంగాణ నాయకుడు ఒకరికి ఎంపీ సీటు ఇస్తారని.. అదికూడా యూపీలాంటి కీలక రాష్ట్రం నుంచి ఇస్తారని కలలోనైనా ఆలోచించలేనిది. కానీ, ఇది సాధ్యమైంది.
ఢిల్లీలో ఆయన హవా చూసి..తెలంగాణ బీజేపీ నాయకుడికి ఎంపీ టిక్కెట్ రావడంలో ఆయన పాత్ర కంటే ప్రత్యర్థి పార్టీ కొత్త ఎంపీ పరోక్షంగా చేసిన ప్రయత్నమే అధికంగా ఉందని చెప్పవచ్చు. అధికార పార్టీ నుంచి ఎంపికైన ఆయన ఢిల్లీలో చేసిన హడావుడి.. బీజేపీ నాయకుడికి కలిసొచ్చింది. తెలంగాణ అధికార పార్టీ నుంచి ఎంపీ అయిన వెంటనే సదరు నాయకుడు 600 మంది సొంత సామాజికవర్గం వారిని, మరికొందరిని ఢిల్లీ తీసుకెళ్లాడు. అక్కడ రెండు స్టార్ హోటళ్లను పదుల సంఖ్యలో రూమ్ లను బుక్ చేశాడు. ఇంకా ఇతరత్రా వారి కష్టసుఖాలు చూశాడు. ఇదంతా మూడు, నాలుగు రోజుల పాటు సాగింది. దీంతో ఆయనకు రూ.5 కోట్ల వరకు ఖర్చు అయింది. కానీ, దానిని లెక్క చేయలేదు. తన సంతోషాన్ని తన మనుషులతో ఆ విధంగా పంచుకున్నాడు.
కేంద్ర వర్గాలకు ఉప్పంది..తెలంగాణ అధికార పార్టీ నాయకుడు తన ఆనందం కోసం చేసినది బాగానే ఉన్నా.. దేశ రాజధానిలో ఆయన హడావుడి చూసిన కేంద్ర వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఈయనకు అంత సత్తా ఏమిటి? అని ఆరా తీశాయి. సొంత సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుసుకుని ఎత్తుకు పై ఎత్తు వేయాలని బీజేపీ పెద్దలు భావించారు. అందులోనూ బీజేపీ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తనదే గెలుపని అనుకుంటోంది. ఆమేరకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఢిల్లీలో కొత్త ఎంపీ హడావుడి చూసి వారికి.. తెలంగాణలో తామేదో వెనుకబడ్డామన్న ఆలోచనవచ్చినట్లుంది.
అనూహ్యంగా ఆయనకు తెలంగాణ అధికార పార్టీ ఎంపీ హంగామా చూశాక.. తెలంగాణలో అదే సామాజిక వర్గం నాయకుడికి తాము ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని భావించింది. వాస్తవానికి తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభ ఎంపీ టిక్కెట్ ఇచ్చి తమ ప్రయత్నాలను ప్రబలంగా ముందుకుతీసుకెళ్లాలని బీజేపీ భావించింది. తెలంగాణలోని అత్యంత వెనుకబడిన జిల్లాకు చెందిన మహిళా నేతను రాజ్య సభకు పంపాలని అనుకుంది. ధన బలం కూడా దండిగా ఉన్న ఆమె.. ధాటిగా మాట్లాడగలరు. రాజకీయంగానూ సుదీర్ఘ అనుభవం ఉంది. కానీ, రాష్ట్రంలోని అధికార పార్టీ ఎంపీ ఢిల్లీలో చేసిన సందడి చూశాక వారి ఆలోచన మారింది.
తాముకూడా అదే సామాజికవర్గం నాయకుడికి రాజ్య సభ ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సీనియర్ బీసీ నాయకుడిని ఎంపీ చేసింది. రాజకీయంగా ఈయనకూ సుదీర్ఘ అనుభవం ఉంది. యుక్త వయసు నుంచి పార్టీనే నమ్ముకున్నారు. కాకపోతే ప్రజా బలం తక్కువం. అయితే, ఆయన సామాజిక వర్గం బలం తెలంగాణలో చాలా ప్రభావవంతం. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని పరిగణనలోకి తీసుకుని బీజేపీ ఆ నాయకుడిని ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది. అప్పటివరకు పెద్దగా రేసులో లేని ఆయనను అలా పదవి వరించింది.