Begin typing your search above and press return to search.

దావూద్ ను ఏసేయటానికి మాటలెందుకు?

By:  Tupaki Desk   |   7 Sep 2015 10:08 AM GMT
దావూద్ ను ఏసేయటానికి మాటలెందుకు?
X
ముంబయి పేలుళ్లతో వందలాది మంది అమాయకుల ప్రాణాలు తీయటంతో పాటు.. పలు ఉగ్రవాద కార్యకలాపాలకు కారణమైన దావూద్ ఇబ్రహీంను తుదముట్టించే విషయంలో కేంద్రమంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ నోరు జారారా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది. దావూద్ ను మట్టుబెట్టే విషయంలో సామ..దాన..దండోపాయాలతో ఏదో ఒక చర్య తీసుకోవటం ఖాయమని తేల్చేశారు.

దావూద్ ను పట్టుకునే విషయంలో బీజేపీ సర్కారు ఏమీ చేయలేకపోవతుందన్న అంశంపై స్పందించిన రాథోడ్.. తన శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండదని.. పాక్ లోని దావూద్ కదలికలపై తమకు పూర్తి సమాచారం ఉందని.. ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలే కానీ ఏదో ఒక సందర్భంగా దావూద్ పనిని ముగించేస్తామంటూ చెప్పేయటం ఇప్పుడు కలకలం రేగుతోంది.

ఎంతపెద్ద నేరస్తుడినైనా న్యాయబద్ధంగా.. చట్టబద్ధంగా విచారణ జరిపి.. నేరం నిరూపించిన తర్వాత మాత్రమే శిక్ష విధించే విధానానికి కట్టుబడి ఉంటానని చెప్పుకునే భారత్ వైఖరికి కేంద్రమంత్రి మాట భిన్నంగా ఉండటం..కొన్ని సున్నిత అంశాల విషయంలో బయటకు చెప్పకూడని మాటల్ని రాధోడ్ ఓపెన్ గా చెప్పేయటం అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా.. చేయాల్సినవి గుట్టుగా చేయకుండా చేతలు తక్కువ.. మాటలు ఎక్కువన్నట్లుగా వ్యవహరించటం ఏమిటో..?