Begin typing your search above and press return to search.
షీనా బోరా కేసు పని అయిపోయినట్లేనా?
By: Tupaki Desk | 10 Sep 2015 6:51 AM GMTబాలీవుడ్ క్రైం థిల్లర్ ను మరిపించే అంశాలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా కేసు షెడ్డుకు వెళ్లినట్లేనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ.. సంచలన అంశాల్ని గంటల వారీగా వెలికి తీయటంతో కీలక పాత్ర పోషించిన ముంబయి పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను పదోన్నతిపై పనికిరాని పోస్టింగ్ ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ కేసు అంతు చూసే వరకు వదిలిపెట్టనన్నట్లుగా వ్యవహరించిన రాకేశ్ మారియాను ఉన్నట్లుండి మార్చేయటం ఆయన్ని తీవ్రంగా కలిచివేసినట్లుగా కనిపించింది. తొలుత ఆయనకు స్థాన చలనం జరిపినప్పటికీ షీనాబోరా కేసును ఆయనే డీల్ చేస్తారన్న మాట వినిపించింది. అయితే.. అందుకు రాకేశ్ మారియా మాత్రం నో అని చెబుతున్నారు.
ముంబయి కమిషనర్ గా తన సమాన హోదాలో ఉన్న మరొకరిని నియమించిన తర్వాత.. కేసును పర్యవేక్షించటం సరికాదని.. అలా చేస్తే ముంబయి పోలీసు వ్యవస్థలో మరో పవర్ సెంటర్ ఏర్పడే అవకాశం ఉందని.. కిందిస్థాయి ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని తేల్చి చెబుతున్నాడు.
తాజాగా రాకేశ్ మారియా తీరు చూస్తుంటే.. షీనా బోరా కేసును ఆయన డీల్ చేసే ఛాన్స్ కనిపించటం లేదు. మరి.. ఆయన మాదిరి.. అంతే ఉత్సాహంగా.. అంతే శ్రద్ధగా ఈ కేసును డీల్ చేస్తారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఆయన స్థానంలో వచ్చిన అహ్మద్ జావేద్ ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొస్తారా? లేదంటే షెడ్డుకు తీసుకెళతారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా ఒక సంచలన కేసును డీల్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారిని ఉన్నట్లుండి మార్చేయటం మహారాష్ట్ర సర్కారుపై మాయని మచ్చలా పడటం ఖాయమని చెప్పక తప్పదు.