Begin typing your search above and press return to search.
హత్య తర్వాత ఏపీ మంత్రికి రాకేశ్ ఫోన్?
By: Tupaki Desk | 1 March 2019 5:13 AM GMTప్రవాసభారతీయుడు కమ్ ఒక న్యూస్ చానల్ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించిన విచారణ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా ఒక కొత్త విషయం నిందితుడు రాకేశ్ నోటి నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా రాకేశ్ ఫోన్ ను పరిశీలించిన పోలీసులకు.. ఏపీ మంత్రికి సంబంధించిన ఒక కాల్ ఉన్నట్లు కాల్ డేటాలో దొరికినట్లుగా తెలుస్తోంది.
జయరాం హత్య చేసిన పక్క రోజున ఏపీ మంత్రికి ఫోన్ చేసిన రాకేశ్.. ఆయనతో మాట్లాడాలని.. అందుకు సమయం కావాలని కోరినట్లు చెప్పారు. ఒక చిన్న పని ఉందని చెప్పిన రాకేశ్.. ఆయన్ను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పటం.. అందుకు సదరు మంత్రి ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. దీంతో.. పిబ్రవరి 2న వస్తానని సదరు మంత్రికి చెప్పారని తెలుస్తోంది.
దీంతో ఆయన్ను కలిసేందుకు విజయవాడకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారని.. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు విజయవాడకు వెళ్లే ఫ్లైట్ కు టికెట్ బుక్ చేసుకున్నారు. మరోవైపు జయరాం హత్య అనంతరం ఈ అంశంపై మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న నేపథ్యంలో గచ్చిబౌలిలోని ఒక హోటల్లో రూమ్ తీసుకున్నట్లుగా తాజా విచారణలో బయటకు వచ్చింది.
హోటల్ నుంచి తెల్లవారుజామున ఎయిర్ పోర్ట్ కు బయలుదేరిన సమయంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మంత్రిని కలిసి.. విషయం చెప్పి సాయం చేయాల్సిందిగా కోరాలన్న ఆలోచనలో రాకేశ్ ఉన్నట్లుగా సమాచారం. అయితే.. ఏపీకి సంబంధించిన ఆ మంత్రి ఎవరు? ఆయనకు రాకేశ్ కు మధ్యనున్న సంబంధాలు ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. మరోవైపు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు శిఖా చౌదరి సహకరించిందన్న అనుమానం ఉన్న తెలంగాణ పోలసులు ఇప్పుడామెకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.