Begin typing your search above and press return to search.
జయరాంను చంపింది ఎందుకో చెప్పిన రాకేశ్
By: Tupaki Desk | 4 Feb 2019 7:15 AM GMTరెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ సంచలనం సృష్టించిన ప్రవాస భారతీయుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం చిగురుపాటి మర్డర్ మిస్టరీ వీడిపోయింది.మొదట్నించి అనుమానిస్తున్నట్లే.. ఈ మర్డర్ ను శిఖాచౌదరి బాయ్ ఫ్రెండ్ రాకేశ్ చేసినట్లుగా ఒప్పుకున్నట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జయరాంను హత్య చేయటానికి కారణం ఆర్థిక లావాదేవీలేనని చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులకు రాకేశ్ ఏం చెప్పారన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చెప్పాల్సి వస్తే.. మెదక్ లో జయరాంకు టెట్రాన్ పాలీలెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. దీంతో గొడవలు అవుతున్నాయి. వాళ్లకు జీతాలు ఇచ్చేందుకు జయరాం నా దగ్గర రూ.4.5 కోట్లు అప్పు తీసుకున్నాడు.
ఆ సమయంలోనే శిఖా చౌదరి పరిచయమైంది. ఆ తర్వాత మా బంధం మరింత బలపడింది. శిఖాను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెప్పింది. ఆమె కోసం నేనుచాలా డబ్బు ఖర్చు చేశా. అయితే.. శిఖాను వదిలేయాలని జయరాం చెప్పారు. అయితే.. తనకు ఇవ్వాల్సిన రూ.4.5కోట్లు.. శిఖాకు ఖర్చు చేసిన కోటి రూపాయిలు కలిపి మొత్తం రూ.5.5కోట్లు చెల్లించాలని చెప్పా. అందుకు సరేనన్న జయరాం తర్వాత ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
జనవరి 29న జయరాం అమెరికా నుంచి వచ్చారని తెలుసుకొని డబ్బులు అడగటానికి వెళ్లా. కానీ.. ఎంత అడిగినా ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోయేసరికి అతన్ని కిడ్నాప్ చేసి హోటల్ కు తీసుకెళ్లా. జనవరి 31 రాత్రి మా మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దాంతో కోపం వచ్చి మూడు పిడిగుద్దులు గుద్దా. హార్ట్ పేషెంట్ కావటంతోజయరాం చిన్నదెబ్బలకే చనిపోయాడు. ఏం చేయాలో తోచలేదు. దీంతో.. మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి నందిగామ సమీపంలో వదిలేశా. అక్కడ నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్నా అని చెప్పినట్లు తెలుస్తోంది.