Begin typing your search above and press return to search.
రైతు నేత పొగడ్తతో చెలరేగిపోతున్న గులాబీ బ్యాచ్
By: Tupaki Desk | 4 March 2022 4:00 AM GMTరాకేశ్ టికాయత్.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడీ సర్కారుకు చుక్కలు చూపించిన రైతు నాయకుడిగా ఆయన్ను చెప్పాలి. ఎవరి మాట వినని మొండి ప్రధానిగా పేరున్న నరేంద్ర మోడీ సర్కారుపై ఉద్యమ శంఖాన్ని పూరించటం.. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పి.. నెలల తరబడి పోరాటం చేసి.. చివరకు మోడీ సర్కారు వెనక్కి తగ్గేలా చేసిన ఘనుడు రాకేశ్ తికాయత్. అలాంటి ఆయన.. ఆ మధ్యన హైదరాబాద్ కు రావటం.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన విమర్శలు చేసిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది.
జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన కేసీఆర్ కు.. రాకేశ్ తికాయిత్ చేసిన విమర్శలు మింగుడుపడలేదని చెప్పాలి. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా రాకేశ్ తికాయత్ కేసీఆర్ నివాసానికి వెళ్లటం.. ఈ సందర్భంగా తెలంగాణలో తాము చేస్తున్న పనుల గురించి.. వ్యవసాయ రంగానికి తాము చేపట్టిన పథకాల గురించి.. రైతు బంధు పథకం గురించి వివరించినట్లుగా చెబుతున్నారు.
గులాబీ బాస్ చెప్పిన మాటలు విన్న రాకేశ్ తికాయత్.. రైతు బంధు పథకం మీదా.. వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కారు వేస్తున్న పెద్ద పీట మాటలకు సంతోషానికి గురై.. కేసీఆర్ సర్కారుపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఎప్పుడైనా.. ఎవరైనా సరే.. తాము చేసే పనుల గురించి చెప్పినప్పుడు.. వారి వాదనను విన్నప్పుడు కన్వీన్స్ కావటం ఖాయం. అందునా.. కేసీఆర్ లాంటి మహానేత స్వయంగా పిలిపించుకొని.. కూర్చోబెట్టుకొని తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరిస్తే.. ఎవరు మాత్రం కన్వీన్స్ కాకుండా ఉంటారు చెప్పంది.
రాకేశ్ తికాయత్ కూడా అలానే కన్వీన్స్ అయి ఉండొచ్చు. కేసీఆర్ సర్కారుపై ఆయన నోటి నుంచి వచ్చిన ప్రశంసలపై గులాబీ బ్యాచ్ వెంటనే స్పందించింది. తమను విమర్శించే వారిపై విరుచుకుపడటమే కాదు.. రాకేశ్ తికాయత్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చేసిన విమర్శలకు తమదైన శైలిలో చేసిన వ్యాఖ్యా విన్న తర్వాత ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. వారి గడుసుతనానికి ముచ్చట పడేలా చేస్తుంది.
ఇంతకూ వారి వాదన ఏమంటే.. హైదరాబాద్ కు వచ్చిన వేళలో రాకేశ్ తికాయత్ కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేసి ఉండరని.. నాడు హిందీ అర్థం కాని మన యాంటీ తెలంగాణ మీడియా రైతు నేత రాకేశ్ అనని మాటల్ని పత్రికల్లో రాశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఉండే జర్నలిస్టుల్లో హిందీ రాని వారెందరు? లాంటి ప్రశ్నలు వేసుకోకుండా.. ఉత్సాహంతో ఊగిపోతూ.. తమను తప్పు పట్టే వారిపై వెరైటీగా విరుచుకుపడే గులాబీ బ్యాచ్ కు తాజా ఉదంతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.