Begin typing your search above and press return to search.

రాఖీసావంత్‌..మోడీని మ‌ళ్లీ ర‌చ్చ‌కీడ్చింది

By:  Tupaki Desk   |   16 Dec 2017 1:40 PM GMT
రాఖీసావంత్‌..మోడీని మ‌ళ్లీ ర‌చ్చ‌కీడ్చింది
X
ర‌క‌ర‌కాల ప‌బ్లిసిటీ కార్య‌క్ర‌మాల‌తో హ‌ల్‌చ‌ల్ చేయ‌డంలో ముందుండే బాలీవుడ్ ఐటం బాంబ్ రాఖీ సావంత్‌ తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని మ‌రోమారు రంగంలోకి దించింది. త‌న‌కు తానుగా ప్ర‌ధాని ఫ్యాన్ అని ప్ర‌క‌టించేసుకున్న ఈ ముద్ద‌గుమ్మ‌...తాజాగా బ‌ట్ట‌లేసుకోవ‌డం ద్వారా ప్ర‌ధానిని ఇరుకున ప‌డేసింది. అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న ఇస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఉన్న బొమ్మ‌తో కూడా బ‌ట్ట‌ల‌ను ధ‌రించ‌డం ద్వారా రాఖీ వార్త‌ల్లో నిలిచింది. అయితే మ‌రో రూపంలో ఆమె మ‌ళ్లీ మోడీని ర‌చ్చ‌కు ఈడ్చింది. అప్ప‌ట్లో మోడీని త‌న డ్రీమ్ మ్యాన్ అని ప్ర‌క‌టించిన రాఖీ..ఇప్పుడు ఆయ‌న్ను త‌న‌కు తండ్రిని చేసేసింది.

ఇన్‌ స్టాగ్రాంలో రాఖీ పోస్ట్ చేసిన వీడియో ప్ర‌కారం ప్ర‌స్తుతం రాఖీసావంత్‌ న్యూయార్క్‌లో ఉంది. `నా ఫ్రెండ్స్ చాలామంది చేసుకోబోయే వాడిని ఎప్పుడు చూపిస్తావు అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. నా వ‌రుణ్ణి క‌నుగొన్నాను. ఇదిగో ఈయ‌నే నా ప్రియుడు - వ‌రుడు. మోడీగారు మీ అల్లుణ్ణి క‌ల‌వండి` అని రాఖీ పేర్కొంది. దీంతో పాటుగా రాఖీ ఇందులో ప‌లు హొయ‌లు కూడా పోయింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న ఫ్యాన్ అని పేర్కొంది. భార‌త‌దేశంలో చచ‌లా మంది ఇప్పుడు త‌నవైపు చూస్తున్నార‌ని పేర్కొంది.

కాగా, రాఖీ సావంత్ గ‌తంలో ప‌లు వార్త‌ల‌తో తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఓ టీవీలో పాల్గొని ఎలేష్ పురంజ‌న్‌ వాలా అనే వ్య‌క్తితో నిశ్చితార్థం చేసుకుంది. 2009లో జ‌రిగిన ఈ ప‌రిణామం అప్ప‌ట్లో అంద‌రి చూపును ఆమె వైపు తిప్పింది. అయితే కేవ‌లం డ‌బ్బు కోస‌మే ఈ ప‌ని చేసిన‌ట్లు ఆమె ప్ర‌క‌టించింది. కాగా, లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన‌న గుర్మిత్ బాబా జీవిత క‌థ ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయ‌న ద‌త్త‌పుత్రిక పాత్ర‌ను రాఖీసావంత్ పోషిస్తోంది.