Begin typing your search above and press return to search.
మోడీ కంట్లో పడేందుకే సెక్సీ స్టార్ పాట్లు
By: Tupaki Desk | 13 Aug 2016 3:19 AM GMTతరచూ ఏదో ఒక వివాదంతో జతకట్టి వార్తల్లో నలిగే రాఖీ సావంత్ కన్ను ఇప్పుడు ప్రధాని మోడీపై పడింది. అవకాశం దొరికిన ప్రతిసారీ మోడీని పొగిడేసే రాఖీ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా షికాగోలో నిర్వహించిన ప్రీ ఇండిపెండెన్స్ డే కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మోడీ బొమ్మలున్న డ్రెస్ వేసుకొని హాట్ టాపిక్ గా మారింది. మోడీ మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించేందుకే స్పెషల్ గా డ్రెస్ ను డిజైన్ చేయించినట్లుగా చెప్పుకుందీ సెక్సీ భామ.. తాను వేసుకున్న మోడీ డ్రెస్ లోనూ అందాల ప్రదర్శనను మాత్రం మిస్ కాలేదు.
ప్రధాని ఫోటోల్ని పెద్ద ఎత్తున వాడిన డ్రెస్సును డిజైన్ చేసిన తీరుపై పలువురు విమర్శలు చేస్తున్న వేళ.. మీడియా ఇదే అంశాన్ని ప్రశ్నిస్తే తనదైన శైలిలో సమాధానం చెప్పుకొచ్చింది. మోడీ తన డ్రీం మ్యాన్ అని.. బీజేపీని.. ఆ పార్టీ అధినేత అమిత్ షాను.. ప్రధాని మోడీని ఇంప్రెస్ చేయటానికే ఈ డ్రెస్ వేసుకున్నట్లుగా వెల్లడించింది.
భారత దేశ ప్రధానుల్లో మోడీ ఉత్తమ ప్రధానిగా అభివర్ణించిన రాఖీ సావంత్.. తనను బీజేపీలోకి ఆహ్వానిస్తే చేరిపోవటానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని చెప్పేసింది. తన డ్రెస్ గురించి ప్రశ్నిస్తున్న మీడియా మీద చిరాకు పడిపోయిన ఆమె.. తన డ్రెస్ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దంటూ సలహా ఇచ్చిన రాఖీ.. మోడీ గొప్పతనం ప్రచారం చేసేందుకే తానిలా డ్రెస్ వేసుకొని ప్రచారం చేస్తున్నట్లుగా చెప్పింది. మోడీ మీద నిజంగా అభిమానం ఉంటే.. ఇలా సెక్సీగా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ప్రచారం చేయరు కదా? సెక్సీ లుక్స్ తో వార్తల్లో నిలిచే సెలబ్రిటీ ఎంత కంట్లో పడినా.. పట్టించుకోనట్లుగా ఉంటారే తప్ప.. పిలిచి పార్టీ కండువా కప్పరు కదా? రాఖీ ఈ లాజిక్ ఎలా మిస్ అవుతోంది..?