Begin typing your search above and press return to search.
ఎన్నికల బరిలో రాఖీ సావంత్.. ఎవరి మీదంటే?
By: Tupaki Desk | 15 Nov 2016 7:20 AM GMTసినిమాల్లో సాధించిందేమీ లేకపోయినా.. హడావుడి మాత్రం బాగానే చేసేది రాఖీ సావంత్. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో కూడా ఇలాగే చేస్తోంది. 2014 ఎన్నికల సందర్భంగా రాజకీయ అరంగేట్రం చేసి.. సొంతంగా ఒక పార్టీ పెట్టి.. ఎప్పటికప్పుడు ఏదో ఒక హాట్ కామెంట్ చేయడం ద్వారా వార్తల్లో నిలవాలని చూస్తున్న రాఖీ.. రాబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగాలని భావిస్తోంది.
ఆమె రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందట. ఐతే ఇంకా నియోజకవర్గం ఏదో నిర్ణయించలేదు కానీ.. రాఖీ పోటీ చేసేది మాత్రం మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మీదనట. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది రిపబ్లికన్ పార్టీ. మాయావతి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ రాఖీ సావంత్ బరిలో ఉంటుందని ఆ పార్టీ ప్రకటించింది. రాజకీయాల్లో సైతం రాఖీది ఐటెం గర్ల్ వేషాలే అనడానికి ఇది తాజా రుజువు.
ఐతే మాయావతి మీద రాఖీ పోటీకి ఉత్సాహంగా ఉండటం సరే కానీ.. ఇంతకీ అసలు మాయావతి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా అన్నదే సందేహంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశాక మాయావతి రాజ్యసభకు వెళ్లిపోయింది. ఇప్పుడు ఎంపీగానే కొనసాగుతోంది. సీఎం అయ్యే అవకాశాలుంటే ఇప్పుడు మళ్లీ పోటీకి సై అనేదేమో కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ పార్టీ గెలిస్తే ఆ తర్వాత చూసుకుందామని.. మాయ పోటీకి దూరంగా ఉండొచ్చని భావిస్తున్నారు. మరి మాయ మీద పోటీ చేసి.. గెలిచేద్దామనుకుంటున్న రాఖీకి నిరాశ తప్పదేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/