Begin typing your search above and press return to search.
ఓవర్ టేక్ చేశాడని కాల్చినట్లు ఒప్పుకున్నాడట
By: Tupaki Desk | 14 May 2016 6:49 AM GMTఅధికార మదం ఒంటినిండా ఎక్కించుకున్న వారు ఎలా వ్యవహరిస్తారనటానికి బీహార్ మాజీ ఎమ్మెల్సీ పుత్రరత్నం యవ్వారం నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి. కేడీ ఫ్యామిలీ అనే మాటకు అచ్చుగుద్దినట్లుగా ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుటుంబం కనిపిస్తుందనటంలో సందేహం లేదు. తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో కోపంతో ఊగిపోయిన మనోరమా దేవి పుత్రరత్నం రాకీ.. అదిత్య సచ్ దేవ్ అనే అమాయకుడ్ని కాల్చి చంపటం తెలిసిందే.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ సీరియస్ కావటంతో బీహార్ పోలీసులు సీరియస్ గా రియాక్ట్ కావటమే కాదు.. రాకీని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించిన పోలీసులకు.. అదిత్యపై తానే కాల్పులు జరిపినట్లుగా ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
వాస్తవానికి.. ఈ ఉదంతం జరిగిన తర్వాత పోలీసుల చేతికి చిక్కిన రాకీ మాట్లాడుతూ.. ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో ఉన్నానని.. ఆధారాలు ఉన్నాయని కోర్టులో ఆ విషయాన్ని చెబుతానని చెప్పటం తెలిసిందే. అయితే.. పోలీసుల విచారణలో తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. మరి.. ఇతగాడి దుర్మార్గం కోర్టు ముందుకు వెళ్లి.. ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.