Begin typing your search above and press return to search.

మోడీ ఫోటోల‌తో ముస్లిం మ‌హిళ‌ల భారీ ఊరేగింపు

By:  Tupaki Desk   |   8 Dec 2017 5:04 AM GMT
మోడీ ఫోటోల‌తో ముస్లిం మ‌హిళ‌ల భారీ ఊరేగింపు
X
అస‌ద్ లాంటి క‌రుడుగ‌ట్టిన మ‌త రాజ‌కీయ‌నాయ‌కుడికి ఒక ప‌ట్టాన అర్థం కాని ప‌రిణామంగా చెప్పాలి. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి త‌మ మ‌తానికి సంబంధించిన అంశాల్ని రాజ‌కీయ పార్టీలు టేక‌ప్ చేయ‌కుండా సెంటిమెంట్ సెంట్ తో నెట్టుకొస్తున్న వారికి షాకిస్తూ.. ప్ర‌ధాని మోడీ ముమ్మారు త‌లాక్ విష‌యంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు అనూహ్య ఫ‌లితాల్ని ఇస్తున్నాయి.

ట్రిపుల్ త‌లాక్ ఉదంతంలో ముస్లిం పురుష స‌మాజం నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నా.. అందుకు భిన్నంగా ముస్లిం మ‌హిళ‌లు మాత్రం సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఏళ్ల‌కు ఏళ్లుగా త‌మ ఈతిబాధ‌ల్ని ప‌ట్టించుకోని నేత‌ల‌కు భిన్నంగా ప్ర‌ధాని మోడీ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై వారు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంట్లో కూర్చొని మోడీ నిర్ణ‌యాన్ని పొగిడేయ‌టం కాకుండా.. ఇంటి బ‌య‌ట‌కు వారు వ‌స్తున్నారు. ప్ర‌ధాని మోడీకి వారు జైజేలు చెబుతున్నారు. త‌మ భ‌విత‌ను డ్యామేజ్ చేసే ట్రిపుల్ త‌లాక్‌ కు చెక్ పెట్టేలా చ‌ట్టం తెచ్చేందుకు చేస్తున్న మోడీ ప్ర‌య‌త్నాల్ని ముస్లిం మ‌హిళ‌లు పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు పోటాపోటీగా జ‌రుగుతున్నాయన్న స‌మాచారం నేప‌థ్యంలో యూపీకి చెందిన ముస్లిం మ‌హిళ‌లు పెద్ద ఎత్తున బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌ధాని మోడీ ఫోటోల‌ను చేత‌బ‌ట్టుకొచ్చిన వారు.. ఆయ‌న‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. ట్రిపుల్ త‌లాక్ చ‌ట్టం త‌మ జీవితాల్లో మార్పు తెస్తుంద‌ని.. త‌మ హ‌క్కుల్ని కాపాడుతుంద‌న్న ఆశాభావాన్ని వారు వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మ జీవితాలు కొత్త‌గా మార‌నున్నట్లు చెబుతున్న వారు.. త‌మ సందేశాన్ని గుజ‌రాత్ ఎన్నిక‌ల ఓట‌ర్ల‌కు తెలియ‌జేయాల‌న్న ల‌క్ష్యంతో భారీ ర్యాలీ చేప‌ట్టారు. యూపీ రాజ‌ధాని ల‌క్నో.. వార‌ణాసి.. గోర‌ఖ్ పూర్ లాంటి ఊళ్ల‌ల్లో భారీ ఊరేగింపు నిర్వ‌హిస్తున్నారు. త‌మ వాణి గుజ‌రాత్ లోని ముస్లిం మ‌హిళ‌ల‌కు చేరుతుంద‌న్నఆశ‌ను వారు వ్య‌క్తం చేస్తున్నారు. ఆ విష‌యం తేలాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.