Begin typing your search above and press return to search.

బాబాయ్ మాట‌కు అబ్బాయ్ ఫిదా అయ్యాడ‌ట‌

By:  Tupaki Desk   |   16 March 2018 6:11 AM GMT
బాబాయ్ మాట‌కు అబ్బాయ్ ఫిదా అయ్యాడ‌ట‌
X
ఇప్ప‌టివ‌ర‌కూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ప్ర‌సంగాల‌కు రెండు రోజుల క్రితం గుంటూరు స‌మీపంలోని నాగార్జున విశ్వ‌విద్యాల‌యం ఎదుట ఆయ‌న చేసిన సుదీర్ఘ ప్ర‌సంగం మ‌రో ఎత్తు. నాలుగేళ్ల బాకీని ఒక్కపూట‌లో.. అది కూడా దాదాపు రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో నాన్ స్టాప్ గా దంచిప‌డేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ప‌వ‌న్ నోరు విప్పి దాడి చేయాల‌ని డిసైడ్ అయితే.. అదెంత తీవ్రంగా ఉంటుంద‌న్న విష‌యం తాజాగా ప‌వ‌న్ ప్ర‌సంగాన్ని చూసినోళ్ల‌కు అర్థ‌మైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంత కాకున్నా.. ఆయ‌న అడుగుజాడ‌ల్లో ప‌వ‌న్ న‌డుస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. న‌చ్చినోళ్ల‌ను ఆకాశానికి ఎత్తేయ‌టం.. న‌చ్చ‌నోళ్ల‌ను పాతాళానికి తొక్కిపారేయ‌టం కేసీఆర్‌ కు అల‌వాటే. ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే.. న‌చ్చితే కాపాడుకురావ‌టం.. ప‌ల్లెత్తు మాట అన‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం క‌నిపిస్తుంది.

అదే టైంలో లెక్క తేడా వ‌స్తే మాత్రం ఆవేశంతో ఊగిపోయి మ‌రీ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం క‌నిపిస్తుంది. తాజాగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు అండ్ కో మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్‌శ‌ల వ‌ర్షం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏమైనా ప‌వ‌న్ గ‌ట్స్ ను మెచ్చుకు తీరాల్సిందే. బాబు లాంటి వాడితో క‌లిసి ఏళ్ల కొద్దీ జ‌ర్నీ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేలా మాట్లాడ‌టం మ‌రో ఎత్తు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేపాయి. చిన‌బాబు అవినీతి ఇష్టారాజ్యంగా మారింద‌న్న మాట‌ను చెప్ప‌టంతోపాటు.. మీ అబ్బాయి అవినీతి మీ దృష్టికి వ‌చ్చిందా? అంటూ చేసిన వ్యాఖ్య‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారాయి. విభ‌జ‌న త‌ర్వాత ఏపీ రాజ‌కీయాల మీద దృష్టి సారించని బ్యాచ్ అయితే ప‌వ‌న్ ద‌మ్మును తెగ పొడిగేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

చంద్ర‌బాబు మీదా.. లోకేశ్ మీద ఈ త‌ర‌హాలో విమ‌ర్శ‌లు చేయ‌గ‌ల ధైర్యం ప‌వ‌న్ కు మాత్ర‌మే ఉంద‌ని చెప్ప‌టం క‌నిపిస్తోంది.

మామూలుగా మాట్లాడ‌టం వేరు. టార్గెట్ చేసిన‌ట్లుగా ఏపీ అధికార‌ప‌క్షంపై శివాలెత్త‌టం మ‌రో ఎత్తు. తాజా ప‌రిణామాలు చూసిన‌ప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో ప‌వ‌న్ టార్గెట్ చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బాబాయ్ చేసిన ప్ర‌సంగంపై అబ్బాయ్ ట్వీట్ తో కామెంట్ చేసేశాడు. పార్టీ ఆవిర్భావ స‌భ‌ను పురుస‌ర్కించుకొని చేప‌ట్టిన‌భారీ బ‌హిరంగ స‌భ‌కు జ‌నం పోటెత్త‌టం.. ల‌క్ష‌ల్లో జ‌నాలు రావ‌టం తెలిసిందే.

జ‌న‌సేన పార్టీ పెట్టిన త‌ర్వాత ఇంత భారీ స‌భ‌ను ఏర్పాటు చేయ‌టం ఇదే తొలిసారి. అంతే కాదు.. పార్టీ పెట్టిన త‌ర్వాత చంద్ర‌బాబు మీద ఇంత‌లా విమ‌ర్శ‌లు చేసింది కూడా ఇదే తొలిసారి. ప‌వ‌న్ ప్ర‌సంగంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు మొద‌లు తెలుగు త‌మ్ముళ్లు అంతా మండిప‌డుతున్న వేళ‌.. అబ్బాయ్ రాంచ‌ర‌ణ్ త‌న స్పంద‌న‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు.

అంద‌రికీ స్ఫూర్తినిచ్చేలా నిజాయితీగా చాలా గొప్ప‌గా ఉంది బాబాయ్ స్పీచ్‌. రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం అంద‌రం ఎదురుచూద్దామంటూ చెర్రీ త‌న ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. చ‌ర‌ణ్ చేసిన పోస్టుకు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేశారు.