Begin typing your search above and press return to search.
టీడీపీ జోకర్లు... పార్టీ పరువు తీసేస్తున్నారట!
By: Tupaki Desk | 12 Feb 2018 5:49 AM GMTఏపీకి జరిగిన అన్యాయంపై గత వారమంతా టీడీపీ ఎంపీలంతా ఢిల్లీలో నిరసనలు తెలిపారు. ఈ నిరసనల్లో కొందరు పార్లమెంటు లోపల ఆందోళన చేపడితే... కొందరు పార్లమెంటు ఆవరణలో విచిత్ర వేషధారణలో తమదైన రీతిలో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసనల తీరుతో కేంద్రం వైఖరిలో ఏ మేరకు మార్పు వచ్చిందో తెలియదు గానీ... ఏపీకి న్యాయం జరిగి తీరుతుంది, మాదే హామీ అంటూ టీడీపీ ఎంపీలు కలరింగ్ ఇచ్చేస్తున్నారు. ఇక లోక్ సభలో ఏపీకి న్యాయం కోసం తనదైన శైలిలో గళం విప్పి... రాష్ట్రానికి ఎంతో సాదించారంటూ ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆయన సొంత నియోజకవర్గం గుంటూరులో భారీగానే సన్మానం కూడా చేసేశారు. నాలుగేళ్లుగా రెస్ట్ తీసుకుంటున్నట్లుగా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన టీడీపీ ఎంపీలకు ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో ఏపీకి అన్ఆయయం జరిగిందన్న విషయం గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ ఇప్పటికే సెటైర్లు పేలుతున్నాయి. అయినా నాలుగేళ్ల పాటు మొద్దునిద్ర పోయిన వీరా మన ఎంపీలంటూ కూడా కొందరు వీరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న వైనం కూడా మనకు తెలియనిదేమీ కాదు.
మొత్తానికి తమ ఎంపీలు చేసిన పోరాటం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతోందంటూ టీడీపీ కలరింగ్ ఇచ్చుకుంటున్నా... నాలుగేళ్ల పాటు వారు దద్దమ్మలుగా వ్యవహరించారని, ఇప్పుడు కూడా ఓ స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ చాలా మంది ముఖం మీదే చెప్పేస్తున్న వైనం మనకు తెలియనిదేమీ కాదు. ఇలాంటి కీలక తరుణంలో నిన్న రాత్రి ట్విట్టర్‌లో ప్రత్యక్షమైన బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. టీడీపీ ఎంపీలు, వారు చేస్తున్న పోరాటం, ఆ పోరాటం వల్ల టీడీపీకి జరుగుతున్న నష్టం తదితరాలపై చాలా ఘాటుగా స్పందించారు. మొత్తంగా టీడీపీ ఎంపీలను ఆయన జోకర్లతో పోల్చేశారనే చెప్పాలి. టీడీపీ నేత - చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషధారణలో పార్లమెంటు ఆవరణలో తనదైన శైలిలో విచిత్ర నిరసన వ్యక్తం చేస్తుండగా - ఆయనకు మద్దతుగా పార్టీ ఎంపీలు మురళీమోహన్ - గల్లా జయదేవ్ - రామ్మోహన్ నాయుడులు నిలి ఉన్న ఫొటోను తన పోస్ట్ లో పెట్టిన వర్మ... చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు. *ఏపీకి చెందిన ప్రజలు తమ విలువైన ఓటుతో ఇలాంటి జోకర్ల లాంటి ఎంపీలనా ఎన్నుకుంది. ఇలాంటి జోకర్లను చూసి మోదీ కూడా ఏపీని ఓ జోక్‌గానే పరిగణిస్తున్నారేమో. కనీసం వీరు జోకర్లుగా కూడా పనికి రారు. జోకర్లకు తక్కువ.. ఇంకో దేనికో ఎక్కువ. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన టీడీపీని వీరు జాతీయ స్థాయిలో అవమానపరుస్తున్నారు* అంటూ వర్మ తనదైన స్టైల్లో టీడీపీ ఎంపీలను ఏసుకున్నారు.
వర్మ ఈ రేంజిలో ఏసుకుంటే.. కాసేపటి క్రితం టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేశ్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. వర్మ ట్వీట్ నే రీ ట్వీట్ చేసిన కత్తి మహేశ్... ఆ ఫొటోలో విచిత్ర వేషధారణలో కనిపిస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ను టార్గెట్ చేసుకుని మరింత ఘాటు కామెంట్లు చేశారు. *మన ఖర్మ కాలి... ఈయన చిత్తూరు ఎంపీ. ఈయన ఓ డాక్టర్. యాక్టర్ కూడానూ. పార్లమెంటులో బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించాల్సింది పోయి... సభ వెలుపల నాటకాలు - డ్రామాలు చేస్తున్నారు. సిగ్గు సిగ్గు* అంటూ తన రీ ట్వీట్ లో కత్తి మహేశ్ చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు. మొత్తంగా ఏపీకి న్యాయం కోసమంటూ టీడీపీ ఎంపీలు చేసిన నిరసనలను అటు వర్మతో పాటుగా ఇటు కత్తి మహేశ్ కూడా తమదైన రీతిలో దెప్పి పొడిచి అధికార పార్టీని బాగానే ఇరుకున పెట్టేశారన్న మాట.