Begin typing your search above and press return to search.
కేసీఆర్ + థాకరే = డొనాల్డ్ ట్రంప్
By: Tupaki Desk | 12 Feb 2016 11:15 AM GMTరాంగోపాల్ వర్మ అందరికీ మరీ ఎక్కువ అందుబాటులో ఉండేటప్పటికి ఈ మధ్య అతడందరికీ లోకువ అయిపోయాడు గాని ప్రపంచాన్ని వర్మ అంత శ్రద్ధగా ఎవరూ పరిశీలించరు. అతనికి ఉన్న అబ్జర్వేషనే వేరు. అతని ప్రతి కామెంటులోనూ ఓ డెప్త్ ఉంటుంది. కాకపోతే కాస్త మనసు పెట్టాలి. తరచూ ఎవరో ఒకరిని కెలికే వర్మ ఈరోజు అమెరికా అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించాడు. ఇక్కడ సబ్జెక్టులు లేకనో లేక రాబోయే రెండు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనే ఆదుర్దానో తెలియదు గాని వర్మ అమెరికా ఎన్నికల గురించి స్పందించారు.
"అమెరికాకు భలే క్యాండిడేట్ దొరికాడు. స్వచ్ఛంగా - స్వేచ్ఛగా - నచ్చేలా మాట్లాడే ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మన దేశంలో కేసీఆర్ - శివసేన బాల్ థాకరే - బీహార్ లూలూ .. ఈ ముగ్గురు కలిస్తే డొనాల్డ్ ట్రంప్" అని వర్మ ఈరోజు వ్యాఖ్యానించారు. వర్మ కామెంట్లో బాగా డెప్తుంది. ఎందుకంటే... పర్యవసానాలతో సంబంధం లేకుండా మాట్లాడే-నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ లక్షణాలు, తన ప్రాంతం-మతం కోసం కట్టుబడి ఎవడేమనుకున్నా సరే మాట్లాడే శివసేన బాల్ థాకరే లక్షణం, అన్ని విషయాలు జనానికి తెలిసినా వారి ఆయువుపట్టును ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేసే లాలూ ప్రసాద్ లక్షణం ... ఈ మూడూ డొనాల్డ్ ట్రంప్ లో మనం చూడొచ్చు.
మొత్తానికి వర్మ ఖాళీగా ఉండడు, మీడియాను ఖాళీగా ఉంచడు. కానీయ్... ట్విట్టరు ఉన్నంత వరకు, మీడియా ఉన్నంత వరకు నీకు తిరుగేలేదు వర్మ!