Begin typing your search above and press return to search.
'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను బాబు ఆపగలడా..?
By: Tupaki Desk | 3 March 2019 9:59 AM GMTఇదే అసలైన కథ అంటూ రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తీస్తున్నారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఇప్పటికే హైప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా దాదాపు పూర్తి చేసుకుంది. ఈనెల 22న థియేటర్లకు రానుంది. విజయదశమి రోజున ప్రారంభించిన ఈ సినిమా మూడునెలల్లో పూర్తిచేస్తానని చెప్పిన వర్మ అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ - పాటలను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ట్రైలర్ ను బట్టి చూస్తే పక్కాగా తెలుగుదేశం పార్టీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానే తీసినట్లు తెలుస్తోంది.
ఈ తరుణంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు అడ్డంకులు టీడీపీ సృష్టిస్తుందనే ప్రచారం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని చోట్ల వ్యాఖ్యలు, సీన్స్ ఉండడంతో సినిమాను విడుదల కాకుండా చేస్తారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.. అయితే ఆర్జీవీ తన తెలివిని ఇక్కడ ప్రదర్శించారు. ట్రైలర్‌లో ఎన్టీఆర్ - చంద్రబాబు గెటప్ లకు దగ్గరి పోలికలు ఉండడంతో పాటు వారి పేర్లు డైరెక్ట్ గా వాడుకుంటే సినిమా విడుదలకు సమస్య వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సినిమాలో డైరెక్ట్ గా పేర్లు వాడకుండా అక్కడక్కడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
సినిమాలో పార్టీ రంగు పసుపు కాకుండా కొంచె పసుపును పోలిన కలర్ ను వాడి అందులో రిక్షా గుర్తును పెట్టారు. సాధారణంగా టీడీపీది పసుపు జెండాపై సైకిల్ గుర్తు ఉంటుంది. కానీ ఆర్జీవీ రిక్షా గుర్తును వాడారు. అయితే ఈ గుర్తును ఎంచుకున్న వ్యక్తి కొద్దిరోజుల్లోనే అధికారం చేపట్టారని పరోక్షంగా ఎన్టీఆర్ గురించే ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్, చంద్రబాబు పేర్లు కాకుండా వేరే పేర్లు జోడించారని సమాచారం. దీనికి లక్ష్మీపార్వతి కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో ఆర్జీవి ఫైనల్ చేసేశారు.
గతంలో ఆయన 'రక్తచరిత్ర ' సినిమా తీసినప్పుడు డైరెక్ట్‌గా పేర్లు వాడడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో సినిమా విడుదల సమయానికి పేర్లను మార్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం, పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్జీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆయన టీడీపీ అధినేత బాబుకు చిక్కకుండా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను విడుదల చేయడానికి ప్లాన్ వేస్తున్నారు.