Begin typing your search above and press return to search.
ఆయన పార్టీ పెడితే వర్మ పొలిటీషియనే
By: Tupaki Desk | 27 Feb 2016 4:48 AM GMTమనసుకు నచ్చింది మాట్లాడేసే ప్రఖ్యాత దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో మరోసారి చెలరేగిపోయారు. ఆయన కోపాలు.. అలకలు.. ప్రేమలు అన్ని తాత్కాలికమే. ఎంతగా ప్రేమిస్తారో.. అంతే ద్వేషిస్తారు. అంతులేని ప్రేమను కుమ్మరించే ఆయన.. అంతే స్థాయిలో ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. మార్పు మాత్రమే శాశ్వితమన్న మాటను విపరీతంగా నమ్మినట్లు కనిపించే వర్మ.. ఆ పేరుతో తన అవసరానికి అనుగుణంగా ఎలాంటి మాటనైనా చెప్పేస్తుంటారు. ఆయన ఇష్టం.. ప్రేమ.. లాంటి పదాల్ని ఒక చోటకు తెచ్చి.. వీటన్నింటికి సంబంధించి.. ఎప్పటికి మారకుండా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన నోటి నుంచి అతిలోక సుందరి శ్రీదేవి పేరు వస్తుందేమో.
ఆమెను మినహా మిగిలిన వారిని (బాహాటంగా ప్రేమను.. ఇష్టాన్ని ప్రకటించిన వారికి సంబంధించి) సీజనల్ గా ప్రేమించేయటం.. అంతే సీజనల్ గా తిట్టేయటం చాలా కామన్. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రతి మాటను.. ప్రతి అడుగును ఆకాశానికి ఎత్తేసిన వర్మ.. కొద్ది నెలలుగా పవన్ పేరెత్తితే చాలు తిట్టిన తిట్టకుండా తిట్టేస్తున్న పరిస్థితి. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదిలిపెట్టటం లేదన్నది ఆయన చేసే ట్వీట్టే చెప్పేస్తుంటాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే మరోసారి జరిగింది.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా ఆయన గురించి ట్విట్టర్ లో ప్రస్తావించిన ఆయన.. ముద్రగడే రియల్ మెగా పవర్ స్టార్ అంటూ భారీ బిరుదు ఒకటి ఇచ్చేశారు. స్ర్కీన్ మెగా పవర్ స్టార్స్ ఫేక్ యాక్టర్స్ అంటూ ట్వీట్ చేసిన ఆయన.. తాను రాజకీయాల్ని నమ్మనన్న వర్మ.. ముద్రగడ మాత్రం పార్టీ పెడితే.. తాను ఆ పార్టీలో చేరతాననంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను కాపు వర్గానికి చెందిన వాడిని కానప్పటికీ తాను పార్టీలో చేరతానన్న వర్మ.. తన స్నేహితుల్లో ఎక్కువ ఉన్నదంతా కమ్మ వాళ్లేనని వ్యాఖ్యానించారు. వంగవీటి సినిమాకు సంబంధించి తాను మరో మూడు రోజులు బెజవాడలోనే ఉంటున్నట్లు వెల్లడించారు. తాను చేసే సినిమాకు తగ్గట్లుగా ట్వీట్ చేసే వర్మ.. తన తాజా చిత్రం వంగవీటి నేపథ్యంలో ఆయన కాపుల్ని వెనకేసుకు రావటం.. ఏ అవకాశం ఉన్నా ఆకాశానికి ఎత్తేయటం చూస్తుంటే.. కాపుల్ని ‘కమ్మ’గా.. వారికి ఎలాంటి నొప్పి లేకుండా తనవైపు తిప్పుకోవాలన్న ఆలోచన వర్మ ట్వీట్లల్లో కనిపించక మానదు. అందుకే అనేది.. వర్మ తెలివైనోడని.