Begin typing your search above and press return to search.
టీడీపీ ఎమ్మెల్సీకి.. వర్మ గట్టి షాకిచ్చాడుగా
By: Tupaki Desk | 22 Sep 2017 5:31 AM GMTరామ్‌గోపాల్ వర్మ! వివాదాలకు కేంద్రం! అని అనిపించుకునే పర్సనాలిటీకి కేరాఫ్!! ఎవరు ఏమన్నా దానికి తగిన విధంగా స్పందించే వర్మ.. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. `నీ అబ్బ`- అంటూ పెద్ద పెద్ద మాటలతో ఉతికి ఆరేశాడు. వర్మ కామెంట్లు ఇప్పుడు ఏపీ సహా తెలంగాణలో సెన్సేషన్స్ సృష్టిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే... వివాదాస్పద కథనాలను ఇటీవల వరుస పెట్టి తెరకెక్కిస్తున్న వర్మ.. వంగవీటి కథ ఎంత ఇబ్బంది పెట్టినా వదల కుండా తెరకెక్కించి ప్రస్తుతం కోర్టు నుంచి అరెస్టు వారెంటు కూడా ఎదుర్కున్నాడు. అయినా సరే ఇలాంటివి తనకు మామూలేనని ప్రకటించాడు.
అలాంటి మొండి ఘటం.. ఇప్పుడు ఏకంగా ఆంధ్రుల అన్నగారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు రె డీ అయ్యారు. ఆయన జీవితంలోని అనేక మలుపులు, మరో పెళ్లి, పార్టీని కోల్పోవడం, చివరి దశలో మరణం ఇలాంటి అనూహ్యమైన విషయాలను తన స్టైల్లో తెరకెక్కించాలని వర్మ డిసైడ్ అయ్యాడు. దీనికి ``లక్ష్మీస్ ఎన్ టీఆర్` అని పేరు కూడా పెట్టేశాడు. ఇప్పుడు ఈ మూవీ కేంద్రంగానే టీడీపీ నేతలు వర్మపై కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీ ప్రజల్లోకి వెళ్తే.. తమ అధినేత - సీఎం చంద్రబాబు బండారం బయటపడుతుందేమోనని వారు తెగ భయపడి పోతున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ కృష్ణాజిల్లాకు చెందిన ఎమ్మెల్సీ.. బాబూ రాజేంద్రప్రసాద్.. వర్మపై కామెంట్లు చేశారు. ఈ సినిమా తీస్తే.. వర్మ ఇక తెలుగు రాష్ట్రాల్లో తిరగలేడని రాజేంద్రప్రసాద్ అన్నారు. దీనిపై వర్మ ఫైరైపోయాడు. రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్లపై ఫేస్ బుక్ ద్వారా ఘాటుగా సమాధానమిచ్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే రాజేంద్రప్రసాద్ తనను తెలుగు రాష్ట్రాల్లో తిరుగనివ్వనన్నాడని, అసలు రాజేంద్రప్రసాద్ ఎవడో కూడా తనకు తెలియదని అన్నాడు వర్మ. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాలేమైనా నీ అబ్బ సొత్తా అంటూ రాజేంద్ర ప్రసాద్ పై హై కామెంట్ విసిరాడు.
రాజకీయాలను ప్రభావితం చేసిన ఎన్టీఆర్ ను రోల్ మోడల్ గా తీసుకోవాలని, ఎన్టీఆర్ నిర్ణయాలను ఫాలో అయిన వాడే నిజమైన ఫాలోవర్ అని వర్మ చురకలంటించాడు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కి దిమ్మ తిరిగిపోయిందట! వర్మ ఇంత దెబ్బ కొట్టాడేంటబ్బా! అని తన అనుచరులతో చెప్పుకొన్నారట. అయితే, ఇక్కడే ఇంకో విషయం చెప్పుకోవాలి. గతంలో వంగవీటి మూవీ తీస్తానని వర్మ విజయవాడ వచ్చినప్పుడు రంగా అభిమానులు ఆయనను వ్యతిరేకించారు.
అప్పటికప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఇదే బాబూ రాజేంద్ర ప్రసాద్.. సినిమా అనేది ఓ సామాజిక మాధ్యమమని - ఓ డైరెక్టర్ గా వర్మకు ఎవరి జీవిత చరిత్రనైనా సినిమా తీరే రైట్ ఉందని, జనాలు ఇష్టమైతే చూస్తారు, లేకపోతే.. తిప్పికొడతారు! అడ్డు కోవడం మాత్రం సరికాదు.. అంటూ అప్పట్లో చిలక పలుకులు పలికారు. కానీ, ఇప్పుడు తమ కిందకి నీరొస్తోందని తెలియడంతో .. వర్మ ఇక తెలుగు రాష్ట్రాల్లో తిరగలేడంటూ హెచ్చరికలు చేస్తున్నారు దటీజ్.. టీడీపీ పాలిటిక్స్!!