Begin typing your search above and press return to search.
చంద్రబాబుపై వర్మ భలే పేల్చాడులే..
By: Tupaki Desk | 10 Oct 2017 8:13 AM GMTటాపిక్ ఏదైనా సరే రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వెరైటీగా స్పందిస్తుంటాడు. కొన్నిసార్లు వర్మ వేసే సెటైర్లు మామూలుగా ఉండవు. ప్రధానంగా సినిమాల గురించే మాట్లాడే వర్మ.. అప్పుడప్పుడూ రాజకీయాల మీద కూడా వ్యంగ్యాస్త్రాలు విసురుగుతుంటాడు. అప్పుడప్పుడూ ఆయన సెటైర్లు శ్రుతి మించుతుంటాయి కానీ.. కొన్నిసార్లు మాత్రం భలేగా పేలుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబానాయుడి తీరు మీద వర్మ వేసిన వ్యంగ్యాస్త్రాలు అలాగే పేలాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు.. దర్శకుడు రాజమౌళిని అనధికారిక సలహాదారుగా నియమించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
రాజధాని నిర్మాణం కోసం నిపుణులైన ఇంజినీర్లను.. ఆర్కిటెక్టుల్ని నమ్ముకోకుండా రాజమౌళి సాయం తీసుకోవడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో వర్మ కూడా ఆ కోణంలోనే బాబుపై సెటైర్లు వేశాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్మాణం కోసం వందల కోట్లు ఖర్చు చేసి బిల్డింగులు కట్టడం మానేసి.. దాని బదులు ఒక మామూలు బిల్డింగ్ లో గ్రీన్ మ్యాట్ వేసి సభలు నిర్వహించాలని వర్మ సలహా ఇచ్చాడు. ఆ వీడియో ఫుటేజీ రాజమౌళికి సమర్పిస్తే అతను అద్భుతమైన సీజీ.. విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చి టెలికాస్ట్ కు ఇస్తాడని.. అప్పుడది ప్రపంచంలోని అన్ని అసెంబ్లీల కంటే గొప్పగా ఉంటుందని.. బాహుబలియన్ అసెంబ్లీ అవుతుందని అన్నాడు వర్మ. ఈ వ్యాఖ్యల్లో వర్మ ఉద్దేశమేంటన్నది ప్రత్యేకంగా చెప్పాలా?