Begin typing your search above and press return to search.
సోనియమ్మ కోసం ఫ్రీగా వాదిస్తాడట!
By: Tupaki Desk | 13 Jan 2016 12:16 PM GMTదేశంలో గంటల చొప్పున ఫీజులు తీసుకునే న్యాయవాదులు కొద్దిమందే ఉన్నారు. వారిలో అత్యంత ఖరీదైన సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ. వివాదాస్పద కేసుల్ని తనదైన శైలిలో డీల్ చేసే ఆయన తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఊహించని ఆఫర్ ఒకటిచ్చారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో పాటు.. అమ్మాకొడుకులు (సోనియా.. రాహుల్) అండ్ కో కోర్టు మెట్లు ఎక్కేలా చేసిన నేషనల్ హెరాల్డ్ కేసును సోనియా తరఫున వాదించేందుకు తాను సిద్ధమని రాంజెఠ్మాలానీ ప్రకటించారు.
సోనియా కోరితే విచారణకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సోనియాగాంధీ తరఫున వాదించేందుకు ఆయన ముందుకు వచ్చారు. సోనియా కోరితే ఆ కేసును వాదించేందుకు సిద్ధమని రాంజెఠ్మాలనీ ప్రకటించడం ఆసక్తిని రేపింది. ఈ కేసులో సోనియా.. రాహుల్ గాంధీలు ఎలాంటి తప్పులు చేయలేదని తాను భావిస్తున్నానని అందుకే వాదించటానికి తాను సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. అన్నింటికి మించి ఈ కేసుకు సంబంధించి వాదించే అవకాశం తనకిస్తే తాను ఎలాంటి ఛార్జ్ చేయనని ప్రకటించటం గమనార్హం. మరి.. జెఠ్మాలానీ ఆఫర్‌ను సోనియమ్మ ఎలా స్పందిస్తారో చూడాలి.