Begin typing your search above and press return to search.
పేద సీఎం కోసం ఫ్రీగా వాదిస్తాను - టాప్ లాయర్
By: Tupaki Desk | 4 April 2017 7:28 AM GMTకోర్టుల్లో కేసులు వాదించడానికి డబ్బున్న వారి దగ్గర మాత్రమే ఫీజు తీసుకుంటానని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ అన్నారు. పేదవారికి పూర్తిగా ఉచితంగా కేసులు వాదిస్తూ న్యాయసహాయం అందిస్తానని ఆయన చెప్పారు.
ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుమారు 3.42 కోట్ల రూపాయిల ఫీజు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో రామ్ జెఠ్మలానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లి ప్రభుత్వం తనకు ఫీజు చెల్లించకపోయినా కేసు వాదించడానికి తాను సిద్ధమేనని చెప్పారు. కేజ్రీవాల్ ఫీజు చెల్లించలేకపోతే, తన పేద క్లయింట్స్ లో ఒకడిగా భావించి ఉచితంగానే కేసు వాదిస్తానని ఆయన చెప్పారు.
కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించినందుకు రూ. 3.42 కోట్ల బిల్ వేసిన ఆయన, "ఢిల్లీ ప్రభుత్వం ఈ ఫీజును చెల్లించకున్నా, కేజ్రీవాల్ ఇవ్వలేకపోయినా నేను వాదిస్తూనే ఉంటాను. కేజ్రీవాల్ ను నాకున్న పేద క్లయింట్లలో ఒకరిగా భావిస్తాను" అని చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ - తన క్రాస్ ఎగ్జామినేషన్ ను ఎదుర్కొనేందుకు భయపడుతున్నారని చెప్పారు. కాగా, డిసెంబర్ 2016 నాటికి తన ఫీజుగా రూ. 1 కోటి - ఆపై ఒక్కోసారి కోర్టుకు వచ్చినందుకు రూ. 22 లక్షల చొప్పున మొత్తం రూ. 2.42 కోట్లు (11 సార్లు ఆయన కోర్టుకు వచ్చారు) అయిందని గుర్తు చేస్తూ కేజ్రీవాల్ కు రాంజఠ్మలానీ బిల్లును పంపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/