Begin typing your search above and press return to search.
మాఫియా డాన్‌తో రాంజెఠ్మలానీ మాటలు..?
By: Tupaki Desk | 4 July 2015 1:30 PM GMTప్రపంచంలోనే మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్.. పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో నిందితుడైన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి ఒక సంచలన విషయాన్ని సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలానీ తాజాగా వెల్లడించారు.
తాను దావూద్‌తో మాట్లాడినట్లు చెప్పిన రాంజెఠ్మాలానీ.. పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. భారత్‌లో జరిగిన పేలుళ్ల విషయంలో తనకు సంబంధం లేదని దావూద్ చెప్పినట్లుగా పేర్కొన్నారు. భారత్ రావటానికి దావూద్ సిద్ధంగా ఉన్నారని.. ప్రాణరక్షణ విషయంలో సందేహాలు ఉన్నట్లు చెబుతున్నారు. న్యాయవిచారణకు హాజరయ్యేందుకు దావూద్ సిద్ధంగా ఉన్నారని చెప్పిన రాంజెఠ్మాలానీ తాను ఫోన్లో మాట్లాడిన విషయాన్ని వెల్లడించి సంచలనం సృస్టించారు.
ఒక మాఫియా డాన్‌తో ప్రముఖ లాయర్ ఎలా మాట్లాడారు? దావూద్ కాంటాక్ట్ నెంబర్ ఆయనకు ఎలా తెలిసింది? ఆయన మాట్లాడిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారా? ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన తర్వాత.. రాజ్యానికి చెప్పకుండా ఉండటం నేరం కాదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు ఎవరు? ఇన్ని ప్రశ్నలు అడిగే ధైర్యం చేసే వారు ఎవరన్నది పెద్ద ప్రశ్న. ఇలాంటి విషయాల్లో చట్టం తన పని తాను ఎందుకు చేసుకుంటూ పోదో..?